పోతూ.. పోతూ.. వీళ్లను ట్రంప్‌ నుంచి కాపాడటానికి జో బైడెన్ కీలక నిర్ణయం

జో బైడెన్ అధ్యక్షుడిగా కీలక నిర్ణయం తీసుకున్నారు. మిడ్ నైట్ రెగ్యులేషన్ పవర్స్ వాడి కొందరు అధికారులకు క్షమాభిక్ష ప్రకటించారు. డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీ, క్యాపిటల్ హిల్‌పై దాడిపై విచారణ కమిటీ సభ్యులకు పార్థన్ ప్రసాధించారు. 

New Update
America-Hamas: అమెరికాకు హమాస్‌ వార్నింగ్‌...త్వరలోనే ప్రతిఫలం ఉంటుంది!

లాస్ట్ మినెట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఆయనకున్న అసాధరణ అధికాలను వాడి ఇద్దరు ఉన్నతాధికారులకు క్షమాభిక్ష పెట్టారు. యూఎస్ ప్రెసిడెంట్‌గా ఆఖరి రోజు బాధ్యతలు నిర్వహించిన బైడెన్ మిడ్ నైట్ రెగ్యులేషన్స్ పవర్స్ వినియోగించుకున్నారు. నాలుగేళ్లకోసారి అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అయితే ఆ 4ఏళ్ల టర్మ్ పూర్తి అయ్యే టైంలో చివరి రోజు అధ్యక్షుడికి కొత్త చట్టాలు చేసే లేదా మార్చే అధికారాలు ఉంటాయి. వాటినే మిడ్ నైట్ రెగ్యులేషన్స్ అంటారు.

మిడ్ నైట్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి?

అమెరికాలో అధ్యక్ష పదవి దిగిపోయే ప్రతి వ్యక్తి ఈ మిడ్ నైట్ రెగ్యులేషన్స్ చేస్తారు. ఇవి కూడా సాధారణ చట్టాల్లానే అమలు అవుతాయి.  ప్రెసిడెంట్‌ సీటు నుంచి దిగిపోతున్న డెమెక్రటిక్ పార్టీ అధ్యక్షుడు బైడెన్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీలకు క్షమాభిక్ష పెట్టారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీరిపై కక్ష్యతో వేధిస్తారేమో అని ఆ ప్రభుత్వ అధికారులను రక్షించడానికి కాపిటల్ హిల్ దాడులపై ఏర్పాటు చేసిన హౌస్ కమిటీ సభ్యులతోపాటు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీలకు పార్థన్ పెట్టారు. 

ఎవరు వీళ్లంతా..?

2020 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడానికి వీరే కారణమని ఈ అడ్మినిట్రేషన్ అధికారులపై పగ పెంచుకున్నాడు. దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఈ అధికారులకు శ్రీరామ రక్ష లాంటి క్షమాభిక్షను ప్రసాధించాడు. ట్రంప్ గవర్నమెంట్ వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దర్యాప్తు విచారణ చేయలేదని ప్రతీకారం తీర్చుకోవద్దని బైడెన్ అన్నారు. అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ టార్గెట్‌గా చేసుకొని పనిచేసిన జో బిడెన్ పరిపాలన అధికారులపై విచారణ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పదేపదే హెచ్చరించారు. దీంతో ట్రంప్ పాలనలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

Also Read: ఏడు విమానాలు, ది బీస్ట్ కారు :  ట్రంప్ సెక్యూరిటీ చూస్తే మతి పోవాల్సిందే!

వారిపై ట్రంప్‌కు క్షక్ష్య ఇందుకే..

కోవిడ్-19 సమయంలో ప్రెసిడెంట్ జో బిడెన్‌కి శాస్త్రవేత్త డా.ఫౌచీ కీలక సలహాదారు. అమెరికాలో కరోనాపై ట్రంప్ గవర్నమెంట్ నిర్లక్ష్యం గురించి డాక్టర్ ఆంథోని ఫౌసీ నిలదీశారు. అమెరికా మాజీ ఆర్మీ జనరల్ మార్క్ మిల్లీ కూడా డొనాల్డ్ ట్రంప్‌ లక్ష్యంగా అనేక ఆరోపణలు చేశారు. ట్రంప్‌ను ఫాసిస్టు అని అన్నారు. 2021 జనవరి 6న కాపిటల్ హిల్‌పై జరిగిన దాడిలో మాజీ అధ్యక్షుడి పాత్రపై దర్యాప్తు చేస్తున్న బృందానికి జనరల్ మార్క్ మిల్లీ సహాయం చేశారు. దీని కారణంగా ట్రంప్, మిల్లీ మధ్య వైరం మరింత పెరిగింది. క్యాపిటల్ హిల్ దాడిపై నియమించిన కమిటీ దర్యాప్తు చేస్తున్న సభ్యులను కూడా ట్రంప్ టార్గెట్ చేయోచ్చని బైడెన బావించాడు. 

Also Read: Joe Biden: అధ్యక్షుడిగా చివరి రోజు.. జో బైడెన్‌ ఎక్కడ గడిపారో తెలుసా?

ఎందుకంటే క్యాపిటల్ హిల్‌పై దాడికి తన మద్దతుదారులను డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించడాని, ఎన్నికల పారదర్శకత, న్యాయబద్ధతపై తప్పుడు వాదనలు చేశారని ఈ కమిటీ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. అమెరికా దేశద్రోహ చట్టం కింద ట్రంప్‌పై విచారణ చేయాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. జో బిడెన్ పెట్టిన క్షమాపణతో ఈ అధికారులను రానున్న 4 సంవత్సరాలు ట్రంప్ ఏం చేయలేరు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు