/rtv/media/media_files/2025/02/09/tscQO2UWyqnIpSpRM1KU.webp)
Telangana Jana Samithi
Telangana Jana Samithi : తెలంగాణలో మరో రాజకీయ సంచలనానికి తెరలేసింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొ. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి కాంగ్రెస్ లో విలీనం కావడానికి రంగం సిద్ధమైంది. మెజారిటీ టీజేఎస్ నాయకులు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కోరుతున్నారు. దీంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కోదండరాం సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ దిశగా రెండు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి.
ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో
కాంగ్రెస్‌లో విలీనం దిశగా తెలంగాణ జనసమితి అడుగులు పడుతున్నాయి. తెలంగాణ జనసమితి రాష్ట్ర కమిటీ సమావేశంలో మెజార్టీ నేతల అభిప్రాయం ఇదేకాగా ఈ భేటీ తర్వాత ఈ విషయంపై మరింత క్లారిటీ రానుంది.ఆదివారంహైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జనసమితి రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో ఒక ఆసక్తికరమైన అంశంపై సభ్యులు పట్టుబట్టారు. జనసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆ పార్టీ నేతలు కోదండాం పై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. దీనికి సంబంధించి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: Pakistan PM : పరువు తీయొద్దు .. భారత్ పై గెలవండి..కప్ తీసుకురండి : పాక్ ప్రధాని
చాలా రోజుల నుంచి తెలంగాణ జనసమితి కాంగ్రెస్‌లో విలీనం అవుతుందన్న ప్రచారం సాగుతోంది.ఎన్నికల ముందు దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి. అయితే పార్టీ అగ్రనేత కోదండాం పార్టీని విలీనం చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు. అయితే ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో పాటు ఎమ్మెల్సీగా కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కలిపించింది. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నందున పార్టీలో చేరితేనే బాగుంటుందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుని ఇప్పటిదిప్పుడు పార్టీని విలీనం చేసే అవకాశం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా పార్టీని కాంగ్రేస్‌లో విలీనం చేయడం ద్వారా పార్టీలోని కీలక నేతలకు కాంగ్రెస్ నుంచి పదవులు ఆశించే అవకాశం ఉంది. ఈ విషయంలోనూ కాంగ్రెస్‌తో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read : గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలో వారి ఖాతాల్లోకి రూ.లక్ష!
కాగా గతంలోనే తెలంగాణ జనసమితి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై ప్రొఫెసర్ కోదండరామ్ స్పందించారు. తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై తమ పార్టీ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ సర్కార్‌పై ఉద్యమిస్తోన్న, ప్రజాస్వామ్య శక్తులను ఐక్యం చేసి పోరాటం చేస్తామని తెలిపారు. అయితే ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ప్రచారం చేశారు. ప్రస్తుతం కోదండరాం ఎమ్మెల్సీగా ఉన్నారు.
Also Read: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన