/rtv/media/media_files/2025/02/09/EaM787uaElOdeev6dmZ8.jpg)
indiramma
ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో 4.5 లక్షల మందిని ఎంపిక చేస్తారని, లబ్ధిదారుల జాబితాను ఇన్‌ఛార్జ్ మంత్రులు ఫైనల్ చేయగానే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున జమవుతాయని సమాచారం. దీనిపై తెలంగాణ సర్కార్ ప్రకటన చేయాల్సి ఉంది. కాగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు. దీనిప్రకారం ఎల్-1లో 21.93 లక్షలు, ఎల్-2లో 19.96 లక్షలు, ఎల్-3లో 33.87 లక్షల దరఖాస్తులను చేర్చారు. జీహెచ్‌ఎంసీలో ఇంకా 2.43 లక్షల ఇళ్లను పరిశీలించాల్సి ఉంది. మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 71 వేల 482 మందిని ఇందిరమ్మ లబ్ధిదారులుగా ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
Also read : Delhi Elections Results : లక్కీ ఛాన్స్.. ఎన్నికలకు ముందు పార్టీ మారి గెలిచారు!
ఎలక్షన్ కమిషన్ వివరణ
మరోవైపు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.
ఇక మీసేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై తెలంగాణ పౌరసరఫరాలశాఖ క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవ ద్వారా అప్లికేషన్లు స్వీకరించట్లేదని తెలిపింది. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను మాత్రమే ఆన్‌లైన్ చేయాలని మీసేవను కోరామని వెల్లడించింది. మార్పులు, చేర్పులకు మీసేవ ద్వారా దరఖాస్తులు వస్తున్నాయని పేర్కొంది.
Also Read : నువ్వేం శాడిస్ట్ మొగుడివిరా.. భార్య విడాకులు అడిగిందని చలాన్లతో రివేంజ్!