/rtv/media/media_files/2025/04/19/1zT8ulWcDnpZn0hUlbii.jpg)
TG Inter Exams Results
తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తేదీ ఖరారైంది. రాష్ట్రంలోని ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకే రోజు రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 22న ఈ పరీక్షల రిజల్ట్స్ రానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఏప్రిల్ 22న ఉదయం 11 గం.లకు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది.
Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
ఇలా చెక్ చేసుకోండి
ఆ రోజున రిలీజ్ కానున్న ఇంటర్ రిజల్ట్స్ అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ లేదా http://results.cgg.gov.in/ లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో పాటు మరెందరో అధికారులు హాజరుకానున్నారు.
Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ తమ హాల్ టికెట్ నెంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ఎగ్జామ్స్ మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగాయి. మొత్తం 1532 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు అటెండ్ అయ్యారు.
Inter exams 2025 | telangana-inter-exams | TG INTER EXAMS RESULTS 2025 | latest-telugu-news | telugu-news