బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైలులో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇంకా ఇంటి భోజనం అనుమతించాలని ఆదేశాల్లో పేర్కొంది. లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఆయన ప్రస్తుతం సంగారెడ్డి జైలులో ఉన్నారు. మరో వైపు ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని నరేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా కోర్టును ఆశ్రయించారు.
Also Read : నాగచైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్..!?
కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న పోలీసులు..
అయితే.. నరేందర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కస్టడీ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం సమంజసం కాదని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. మరో వైపు ఆయన కస్టడీ పిటిషన్ పై విచారణను కొడంగల్ కోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. రేపు ఈ అంశంపై విచారణ జరగనుంది.
Also Read : RGV విచారణలో బిగ్ ట్విస్ట్..?
ఈ కేసును మరింత లోతుగా విచారించే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో నరేందర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరుతున్నారు. మరోవైపు ఈ కేసులో మరో కీలక నిందితుడైన సురేష్ ఇంత వరకు పోలీసులకు దొరకలేదు. ఆయనను పట్టుకునేందుకు పలు పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి.
Also Read: Bunny VS Pawan: అల్లు అర్జున్ ముందు పవన్ నథింగ్!
మరోవైపు కలెక్టర్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే పరిగి డీఎస్పీపై వేటు వేసింది. డీజీపీ ఆఫీసుకు ఆయనను అటాచ్ చేసింది. ఒకట్రెండు రోజుల్లో మరింత మంది అధికారులపై వేటు వేసే అవకాశం ఉందన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Also Read: అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!