Hydra: ఖాజాగూడ చెరువులో కూల్చివేతలు చేపట్టిన హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషనర్ రంగనాథ్‌పై జస్టిస్ లక్ష్మణ్ సీరియస్ అయ్యారు. హైడ్రాపై న్యాయమూర్తి లక్ష్మణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెబుతున్నారంటూ మండిపడ్డారు. ఆధారాలు ఉన్నాయా, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధులు తెలియకుండా ఎలా కూలుస్తున్నారని అడిగారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు. కమిషనర్ రంగనాథ్‌ను తాను ఎలా డీల్ చేయాలో అలాగే చేస్తానని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే రంగనాథ్‌పై సీరియస్ వ్యూ ఉంటుందన్నారు. ఇది మొదటిసారి కాదు.. ఖాజాగూడకు సంబంధించిన చెరువు పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ నిర్ణయించకుండా ఎలా చర్యలు తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది మొదటిసారి కాదు.. గతంలోనూ సెప్టెంబర్ 30వ తేదీన కూడా హైడ్రా చాలా దూకుడుగా వెళుతున్న సందర్భంలో కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలు వెంటనే ఆపేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధి నిర్ణయించకుండా.. వాటి పరిధిలో ఉన్నాయంటూ నిర్మాణాలను ఎలా కూలుస్తారంటూ ప్రశ్నించింది. ఇది కూడా చదవండి: Baba Vanga: 2025లో 3వ ప్రపంచ యుద్ధం.. బాబావంగా జోష్యం వైరల్! ఆధారాలున్నాయా.. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధికి గల ఆధారాలు ఏంటని ప్రశ్నించింది. పొలిటికల్ బాస్‌ల కోసం పనిచేస్తే బాగోదని హెచ్చరించింది. కష్టపడి ప్రజలు కట్టుకున్న ఇళ్లను కూల్చడం సరికాదని.. అది కూడా సెలవు రోజుల్లో కూల్చివేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీలాంటి వాళ్లను చంచల్‌గూడ, చర్లపల్లి జైలుకు పంపిస్తే తెలుస్తుందంటూ కూడా సీరియస్ అయింది. ప్రస్తుతం కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్ అయింది. కూల్చివేతలపై హైకోర్టు పలుసార్లు హైడ్రాకు మొట్టికాయలు వేయడంతో మున్ముందు స్పీడ్ తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన వాటిని కూల్చబోమని హైడ్రా తెలిపిన సంగతి తెలిసిందే. అక్రమమైనప్పటికీ వాటి జోలికి వెళ్లబోమని రంగనాథ్ తెలిపారు. నాలుగు నెలల క్రితం నుంచి ప్రారంభమైన వాటిపైనే తాము అడ్డుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు.