మూసీ నది ఆక్రమణలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో వీటిని తొలగించనున్నట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. '' మూసీ నది సుందరీకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి దాదాపు 1600 నిర్మాణాలను అక్రమంగా నిర్మించినట్లు సర్వే ద్వారా గుర్తించాం. వీటిని తొలగించాలని నిర్ణయించాం. ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఒక కార్యాచరణ రూపొందించాం. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు నిర్వాసితులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చి పునరావాసం కల్పిస్తాం.
Also Read: బీజేపీలోకి ఆర్ కృష్ణయ్య.. ఆ కీలక పదవి ఆఫర్ చేసిన మోదీ?
15 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను మూసీ రివడ్ బెడ్, బఫర్ జోన్‌లలో నివసిస్తున్న కుటుంబాల పునరావాసానికి రాష్ట్ర సర్కార్ కేటాయించింది. రివర్ బెడ్‌లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి పునరావాస కార్యాచరణ కోసం సంబంధిత జిల్లా కలెక్టర్లు మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. నిర్వాసితులకు డబులు బెడ్ రూం ఇళ్లు కేటాయించి పునరావాసం కల్పించిన తర్వాతే ఈ నిర్మాణాల తొలగింపు కార్యక్రమం ప్రారంభిస్తాం. బఫర్ జోన్‌కు సంబంధించి భూ సేకరణ, పునరావాస చట్ట ప్రకారం రాష్ట్ర సర్కార్‌కు ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తాం. ఆ తర్వాత మాత్రమే భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మూసీ పరిధిలోని ఆందోళన చెందొద్దు. అర్హులందరికీ పునరావాసం కల్పిస్తాం.