/rtv/media/media_files/2025/11/06/bus-accident-2025-11-06-14-44-09.jpg)
చేవెళ్ల బస్సు ప్రమాద(Chevella Bus Accident) ఘటనపై తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ధర్నాలో పాల్గొన్న పలువురిపై కేసులు నమోదు చేసింది. దాదాపు 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మందికిపైగా మృతి చెందారు. దీంతో రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్లే ఇంతటి ఘోర ప్రమాదం జరిగిందని... తాండూర్ డెవలప్‌మెంట్ ఫోరమ్ స్థానికుల ఆందోళనకు దిగింది.
ఓ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని పోలీసులు తెలిపారు.తరచూ ప్రమాదాలు జరుగుతున్న రోడ్డును బాగు చేయాలని ధర్నా చేసిన వారిపై కేసు పెట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ. 7 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది మరియు డిసెంబర్ 15 లోపు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
Also Read : జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బండి సంజయ్‌కి బిగ్ షాక్..
కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్
తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టిన ఈ ఘటనలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ప్రకారం, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం టిప్పర్ లారీ డ్రైవర్ అతివేగం, నియంత్రణ కోల్పోవడమే అని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు మలుపు వద్ద టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఈ ఘోరానికి దారితీసిందని ఆర్టీసీ ప్రకటించింది.
ఆర్టీసీ బస్సు గానీ, బస్సు డ్రైవర్ గానీ ప్రమాదానికి కారణం కాదని, బస్సు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని, డ్రైవర్ సర్వీసు రికార్డులోనూ గతంలో ఎలాంటి ప్రమాదాలు లేవని ఆర్టీసీ ఎండీ తెలిపారు. అయితే, టిప్పర్ యజమాని మాత్రం ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంగా వచ్చి గుంతలు తప్పించే ప్రయత్నంలో తమ వాహనాన్ని ఢీకొట్టాడని, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
Also Read : కాల్చి పారేస్తా నా కొడకా...భూ వివాదం.. తుపాకీతో బెదిరింపు
Follow Us