/rtv/media/media_files/2025/02/22/do3qMHswfyHnIhWUhB3D.jpg)
Anjani Kumar and Abhilash Bisth
ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్‌ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో చేరేందుకు వీలుగా వెంటనే రిలవ్ చేస్తున్నామని సీఎస్ శాంతికుమారి జీవోలో తెలిపారు. అలాగే కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న అభిషేక్ మహంతి రిలీవ్‌పై ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. కరీంనగర్‌లో ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: సీఎం రేవంత్‌కు ప్రధాని మోదీ ఫోన్.. పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ!
ఈ క్రమంలో అభిషేక్ మహంతి విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఇదిలాఉండగా.. రహదారి భద్రత అథారిటీ ఛైర్మన్ అంజనీకుమార్, తెలంగాణ పోలీసు అకాడమి డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఏపీకి వెళ్లాలని కేంద్ర హోంశాఖ శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: భక్తులకు గుడ్‌న్యూస్.. మహాశివరాత్రికి 3 వేల స్పెషల్ బస్సులు.. ఫుల్ లిస్ట్ ఇదే!
2014లో ఉమ్మడి ఏపీ విభజన అనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT).. రెండు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కొందరు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. ఆ తర్వాత డీవోపీటీ హైకోర్టులో పిటిషన్ వేయడం లాంటి పరిణామాలు జరిగాయి. 2024లో నియమించిన ఖండేకర్ కమిటీ ప్రతిపాదన మేరకు తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఏపీలో రిపోర్ట్ చేయాలని హోంశాఖ అధికారులను ఆదేశించింది.
Also Read: ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్