Shaktikanta Das: ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్బీఐ మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

ప్రధాని మోదీకి ప్రధాన కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ నియమితులయ్యారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం లేదా తదపరి ఉత్తర్వులు వచ్చేవరకు శక్తికాంతదాస్‌ ఈ పదవిలో ఉంటారని కేంద్రం నోటిఫికేషన్‌లో తెలిపింది.

New Update
Former RBI Governor Shaktikanta Das appointed Principal Secretary to PM Modi

Former RBI Governor Shaktikanta Das appointed Principal Secretary to PM Modi

ఆర్బీఐ మాజీ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు మరో కీలక హోదా దక్కింది. తాజాగా ప్రధాని మోదీకి ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం లేదా తదపరి ఉత్తర్వులు వచ్చేవరకు శక్తికాంతదాస్‌ ఈ పదవిలో ఉంటారని కేంద్రం నోటిఫికేషన్‌లో తెలిపింది. 

Also Read: డబ్బులు బొక్కా.. విరిగిపోయిన సీటు ఇచ్చారు.. ఎయిర్‌ ఇండియాపై కేంద్రమంత్రి ఫైర్‌!

శక్తికాంత దాస్‌ ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ-2 గా ఉండనున్నారు. ఇప్పటికే పీకే మిశ్రా ప్రధానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. 2019, సెప్టెంబర్‌ 11 నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. 2014 నుంచి 2015 వరకు శక్తికాంత దాస్‌ భారత రెవెన్యూ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2018లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 2024 డిసెంబర్‌ 10న పదవీ విరమణ పొందారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీకే ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. 
 

Also Read: పెళ్లిచేస్తాం, గిఫ్ట్‌లు ఇస్తామని నమ్మించారు.. చివరికి ఊహించని షాక్

 అంతేకాదు నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం పదవీకాలాన్ని కూడా ఒక ఏడాది పాటు పొడిగించారు. ఆయన పదవీకాలం 2025 ఫిబ్రవరి 25తో ముగియనుంది. తాజాగా జరిపిన పొడిగింపు వల్ల 2026 ఫిబ్రవరి 24 వరకు ఆయన పదవిలో ఉండనున్నారు. రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారి అయిన బీవీఆర్‌ సుబ్రహ్మణ్యం 1987 బ్యాచ్‌కు చెందినవారు. 2023లో కేంద్రం ఆయన్ని నీతి ఆయోగ్‌ సీఈవోగా నియమించిన సంగతి తెలిసిందే. 

Also Read: మావోయిస్టులకు మరో బిగ్ షాక్.. హిడ్మా కూతురు సంచలన నిర్ణయం!

Also Read: కుంభమేళాలో డిజిటల్ స్నానం...కేవలం 1100 లే..అదిరిపోయింది కదా ఐడియా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు