Telangana: సెప్టెంబర్‌ 17.. తెలంగాణలో రేపు ఏం జరగనుంది..

తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీని విలీనం అని ఒకరు, విమోచనమని మరొకరు ఇలా ఏ పార్టీ వారు వాళ్లకి నచ్చినట్లు ఈ రోజును జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. 

New Update
Telangana govt decides to celebrate september 17th as paraja palana day

Telangana govt decides to celebrate september 17th as paraja palana day

1948  సెప్టెంబర్ 17న నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ విముక్తి పొంది భారత్‌లో అధికారికంగా విలీనం అయిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17 తేదీ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఏటా పొలిటికల్‌ హీట్‌ను పెంచుతోంది. విలీనం అని ఒకరు, విమోచనమని మరొకరు ఇలా ఏ పార్టీ వారు వాళ్లకి నచ్చినట్లు ఈ రోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. 

Also Read: ఈ సారి బతుకమ్మ మరింత స్పెషల్.. హైడ్రా ఆధ్వర్యంలో.. రేవంత్ సమక్షంలో ఎక్కడో తెలుసా?

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు జాతీయ జెండా ఎగురవేయాలని సర్క్యులర్‌ను జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ హైదరాబాద్‌లో,  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో జాతీయ జెండాలు ఆవిష్కరించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలానే వేడుకలు జరపనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. 

Also Read: ఈ సారి బతుకమ్మ మరింత స్పెషల్.. హైడ్రా ఆధ్వర్యంలో.. రేవంత్ సమక్షంలో ఎక్కడో తెలుసా?

ఈ సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఎంపీ రఘునందన్‌ రావు ఆయన్ని స్వాగతించారు. రేపు జరగబోయే వేడుకల్లో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొనున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ ఇలా అన్ని పార్టీలు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 17 వేడుక అనేది కేవలం రాజకీయంగా మారింది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు పార్టీ ప్రయోజనాల కోసం తమ విధానాలకు తగ్గట్లు చేసుకుంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు