/rtv/media/media_files/2025/09/16/bathukamma-kunta-two-2025-09-16-20-05-50.jpg)
చెరువుల పునరుద్ధరణ నిర్మాణంలో భాగంగా రూ. 7. 40 కోట్లతో బతుకమ్మ కుంటను పునరుద్ధరణ చేసింది. బతుకమ్మ కుంటకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చింది హైడ్రా.
/rtv/media/media_files/2025/09/16/bathukamma-kunta-one-2025-09-16-20-05-50.jpg)
ఈ సందర్భంగా ఈనెల 25న జరగబోయే బతుకమ్మ ఉత్సవాలకు బతుకమ్మ కుంట వేదికవుతోంది. ఈ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సందడి చేయనున్నారు. అలాగే పండగ వేళ బతుకమ్మకుంటను నగర ప్రజలకు అంకితం చేయనున్నారు .
/rtv/media/media_files/2025/09/16/bathukamma-kunta-four-2025-09-16-20-05-50.jpg)
ఈ మేరకు బతుకమ్మ కుంట వద్ద ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ముఖ్యమంత్రి సలహాదారుడు శ్రీ వేంనరేందర్ రెడ్డి , నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/16/bathukamma-kunta-three-2025-09-16-20-05-50.jpg)
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్గారు, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌గారు, జలమండలి ఎండీ కె. అశోక్‌రెడ్డి ఇతర అధికారులు అక్కడి ఏర్పాట్లను వివరించారు.
/rtv/media/media_files/2025/09/16/bathukamma-kunta-seven-2025-09-16-20-05-50.jpg)
జాతీయ స్థాయిలో బతుకమ్మ కుంటకు గుర్తింపు వచ్చేలా ఉత్సవాలు జరగాలని ముఖ్యమంత్రి సలహాదారుడు శ్రీ వేంనరేందర్ రెడ్డి అధికారులకు సూచించారు.
/rtv/media/media_files/2025/09/16/bathukamma-kunta-four-2025-09-16-20-05-50.jpg)