TG: రైతు భరోసాపై పకడ్బంది ప్లాన్.. సాగుచేయని భూమిని ఎలా గుర్తిస్తారంటే

రైతు భరోసా నిజమైన లబ్దిదారులకు అందించేందుకు తెలంగాణ సర్కార్ పకడ్బంది ప్లాన్ చేస్తోంది. సాగు భూములకు మాత్రమే ఈ స్కీమ్‌ వర్తించేలా ఫీల్డ్​ వెరిఫికేషన్​ బృందాలు క్షేత్రస్థాయిలో జాబితా తయారు చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్, డీఏవో, ఎంపీడీవోలు పరిశీలించనున్నారు. 

New Update
rythu Bharosa revanth reddy

Telangana Rythu Bharosa

Rythu Bharosa: రైతు భరోసా సాయం నిజమైన లబ్దిదారులకు మాత్రమే అందించేందుకు తెలంగాణ సర్కార్ పకడ్బంది ప్లాన్ చేస్తోంది. సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా స్కీమ్‌ వర్తించేలా ఫీల్డ్​ వెరిఫికేషన్​ బృందాలు క్షేత్రస్థాయిలో జాబితా తయారు చేస్తున్నాయి. జిల్లా కలెక్టర్, డీఏవోలు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో ప్రక్రియ కొనసాగనుంది. 

పలు అంశాలలో మార్పులు చేర్పులు..

ఇక ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా  పలు అంశాలలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. జనవరి 26నుంచి స్కీమ్ అమలు చేయనుండగా సాగు చేయని భూములను పక్కనపెట్టాలని నిర్ణయించారు. సాగు చేయని భూముల వివరాలను గ్రామ సభల్లో ప్రదర్శించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఎలా గుర్తిస్తారు.. 


ఫీల్డ్​ వెరిఫికేషన్​ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించనున్నారు. రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్ అధికారులు ఇందులో భాగం కానున్నారు. పంచాయతీ కార్యదర్శి, ఏవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫీల్డ్​ వెరిఫికేషన్ బృందం ఉంటుంది. రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్, ఫీల్డ్​ అసిస్టెంట్​, ఆర్ఏ, ఏఈవోలుకూడా ఉంటారు. జిల్లా కలెక్టర్​ ఆధ్వర్యంలో డీఏవో, ఎంపీడీవో తదితర ఉన్నతాధికారులు ఈ బృందాలను పర్యవేక్షించనున్నాయి.

ఇది కూడా చదవండి: Global Risks Report: 2025లో ప్రపంచానికి పొంచిఉన్న ముప్పులివే..

సర్వే నెంబర్ల ఆధారంగా వివరాలు సేకరించి, ఆర్వోఆర్, పట్టాదారు పాస్​పుస్తకాల జాబితాను పరిశీలిస్తారు. భూ భారతి పోర్టల్ నుంచి జాబితా, విలేజ్​ మ్యాప్, శాటిలైట్ మ్యాప్ ఆధారంగా లిస్ట్ ఫైనల్ చేస్తారు. ఇక లబ్దిదారుల జాబితను గ్రామ సభల ముందు పెడతారు. భూముల వివరాలను ప్రదర్శించి, అభ్యంతరాలుంటే పరిశీలిస్తారు. వివరాల సేకరణ ప్రక్రియను గ్రామ సభ ఆమోదముద్ర వేస్తుంది. ఈ సర్వే జనవరి 16 నుంచి మొదలుకానుండతా జనవరి 25లోపు పూర్తి చేయనున్నారు. 

Advertisment
తాజా కథనాలు