/rtv/media/media_files/2025/12/05/kcr-2025-12-05-19-33-44.jpg)
KCR
BRS అధినేత కేసీఆర్ తన నివాసంలో నేడు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు హాజరైయ్యారు. నందినగర్‌లోని ఆయన ఇంట్లో రెండవ అంతస్థులో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన లంచ్ మీట్ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. నంది నగర్‌లోని తన ఇల్లు తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కేంద్రమని, అక్కడే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించానని ఆయన గుర్తు చేసుకున్నారు. వేలాది మందితో చర్చలు జరిపి, వ్యూహరచన చేసిన అదే గదిలో ఈరోజు విచారణను ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరికాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ..
— Telugu Reporter (@TeluguReporter_) February 1, 2026
మాజీ సీఎంను విచారించనున్న ఐదుగురు అధికారుల బృందం
వారిలో డీఐజీ విజయ్ కుమార్, ఏసీపీలు వెంకటగిరి, శ్రీధర్, అడిషనల్ డీసీపీలు కేఎస్ రావు, రవీందర్ రెడ్డి
కేసీఆర్ ఇంట్లోని 2వ ఫ్లోర్ లో విచారణ ఏర్పాట్లను పరిశీలిస్తున్న సిట్ అధికారులు
కంప్యూటర్,… https://t.co/rlrUWYjp50pic.twitter.com/S1d68kP1nW
ఒకప్పుడు రాష్ట్ర భవిష్యత్తును మార్చే నిర్ణయాలు తీసుకున్న గదిలో, ఇప్పుడు విచారణ ఎదుర్కోవడం తనను మానసికంగా కలచివేస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం నిద్రలేని రాత్రులు గడిపిన చోటే ఇలాంటి పరిస్థితులు రావడం ఎవరూ ఊహించని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.
Follow Us