/rtv/media/media_files/2025/09/01/cbi-2025-09-01-06-24-15.jpg)
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్రణాళిక, రూపకల్పన, నిర్మాణంలో NDSA గుర్తించిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతరాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర సంస్థల భాగస్వామ్యం తదితర అంశాల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించడం సుమచితం అని అన్నారు, దర్యాప్తుకు సభ ఏకగ్రీవంగా నిర్ణయించింది. నిజాయితీతో విచారణ జరగాలని ఆశిస్తున్నా అని సీఎం అన్నారు. సుధీర్ఘ చర్చల అనంతరం సీఎం ఈ ప్రకటన చేశారు. రాత్రి 1.45 గంటలకు సభ నిరవధికంగా వాయిదా పడింది.
Also Read : అమెరికాకు ఆ సేవలు బంద్.. భారత్ సంచలన నిర్ణయం
బిగ్ బ్రేకింగ్
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2025
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/nA8SkSSrHy
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ లేదా సిట్ ద్వారా విచారణ చేపట్టే అవకాశముందని అందరూ భావించారు. కానీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అయితే కక్షపూరిత చర్యలు తీసుకుందనే అపవాదు రాకుండా రేవంత్ సర్కార్ జాగ్రత్త పడినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు.
Also Read : Recording Dance : వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు..VIDEOS వైరల్
గట్టిగానే వాదోపవాదనలు
అంతకుముందు సభలో కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, సీఎం రేవంత్, మంత్రుల మధ్య గట్టిగానే వాదోపవాదనలు జరిగాయి. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని 2009, 14లో కేంద్రం చెప్పినా దోపిడీ చేసేందుకు కేసీఆర్, హరీష్ రావు ప్రాజెక్టు స్థలాన్ని మార్చారని సీఎం రేవంత్ రెడ్డి అరోపించారు. ఆ విషయాన్ని దాచిపెట్టి 2015లో ఉమా భారతి లేఖను పట్టుకుని హరీశ్ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టొద్దని ఎప్పుడూ చెప్పలేదన్నారు సీఎం రేవంత్. కేవలం ఎత్తు తగ్గించుకోవాలని మాత్రమే వాళ్లు సూచించారని అసెంబ్లీలో తెలిపారు.
NDSA ఎందుకు విచారణ జరపడం లేదు
పోలవరం ప్రాజెక్టు పది సార్లు కొట్టుకుపోయినా NDSA ఎందుకు విచారణ జరపడం లేదని అసెంబ్లీలో హరీశ్ రావు ప్రశ్నించారు. 2019-25 వరకు పోలవరం డయాఫ్రమ్ వాల్, గైడ్‌బండ్, కాఫర్ డ్యామ్.. కొట్టుకుపోయాయని, రిపేర్‌కు రూ.7 వేల కోట్లు అవుతుందన్నారు. మరి ఆ సమయంలో పోలవరం చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ మేడిగడ్డపై రిపోర్ట్ ఇస్తారా అని నిలదీశారు. NDSAకు నచ్చితే ఒక నీతి.. నచ్చకుంటే ఒక నీతి ఉంటుందా అని హరీష్ మండిపడ్డారు.
Also Read : LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు!