CM Revanth: ఉమెన్స్ డే గిఫ్ట్.. మహిళా సంఘాలకు రేవంత్ సర్కార్ శుభవార్త!

మహిళా సంఘాల సభ్యులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించింది. ఆ తర్వాత 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నారు.

New Update
CM Revanth Reddy Woman's Day

CM Revanth Reddy Woman's Day

మహిళా సంఘాల సభ్యులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. మొదటి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించింది. ఆ తర్వాత మిగిలిన మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నారు. ప్రతి నెలా ఒక్కో బస్సుకు రూ. 77,220 చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లించనుంది.

బస్సుల కొనుగోలుకు బ్యాంక్ గ్యారెంటీ..

అయితే.. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది. దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పరేడ్ గ్రౌండ్ వేదికగా 50 బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో నూతన యుగం మొదలైందని మంత్రి సీతక్క అభివర్ణించారు. మహిళా సంఘాలకు స్వావలంబన కల్పించే వినూత్న నిర్ణయమన్నారు. అద్దె బస్సుల కేటాయింపుతో మహిళల అభివృద్ధి దిశగా మరో ముందడుగు పడిందన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు