/rtv/media/media_files/2025/08/22/telangana-government-jobs-2025-08-22-16-27-53.jpg)
తెలంగాణలోని నిరుద్యోగులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్స్ తో పాటు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 1623 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు అదే నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా తమ అప్లికేషన్లను సమర్పించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి:BANK JOBS: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 750 బ్యాంక్ జాబ్స్‌కు నోటిఫికేషన్!
Big Breaking
— Damodar Raja Narasimha (@DamodarCilarapu) August 22, 2025
ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల జాతర
1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టులు
దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ గడువు
తెలంగాణ వైద్య విధాన… pic.twitter.com/GG2p6NT6tr
అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు:
విద్యార్హతల వివరాలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతల ఉన్నాయి. సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా/DNB లో అర్హత ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు.
వయస్సు: అభ్యర్థులకు జూలై 1 నాటికి 18-46 నాటికి 18-46 ఏళ్లు ఉండాలి. పలు కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, EWS అభ్యర్థులకు ఐదేళ్లు, PH అభ్యర్థులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇచ్చింది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు.
ఇది కూడా చదవండి:Bank Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. దేశంలో 2.5 లక్షల బ్యాంక్ జాబ్స్!
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు తమ విద్యార్హతల్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.56 వేల నుంచి రూ.1.37 లక్షల వరకు వేతనం ఉంటుంది.
అప్లికేషన్ డైరెక్ట్ లింక్:https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm
మరింత చేరువగా వైద్య సేవలు: మంత్రి
జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించి తెలంగాణ విద్యా శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తన X ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాల భర్తీతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుందన్నారు. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో సేవలు మరింత మెరుగు పడతాయన్నారు. పల్లెలకు స్పెషలాలిటీ వైద్య సేవలు మరింత చేరువ అవుతాయన్నారు. ఇప్పటికే స్పెషాలిటీ వైద్య సేవలు ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇంకా మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.