ఎలక్ట్రిక్ వెహికల్ కొనేవారికి ప్రభుత్వం తీపికబురు.. 100శాతం మినహాయింపు

ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రోడ్‌ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్‌ రుసుముల్ని 100శాతం మినహాయిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘ఈవీ నూతన పాలసీ’ని తీసుకొచ్చింది. నేటి నుంచి ఇది అమల్లోకి రానుంది.

new electric vehicle policy
New Update

ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ అందించే ఈ ఎలక్ట్రిక్ వాహనాలపైనే ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో భారతదేశంలో ఈ ఈవీ వాహనాలు పెరిగిపోయాయి. కాలుష్యాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ఎంకరేజ్ చేస్తున్నాయి. 

Also Read: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం

తీపి కబురు

ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి తీపి కబురు అందించింది. ఈవీ కొనుగోలు చేస్తే రోడ్ ట్యాక్స్, వాహన రిజిస్ట్రేషన్ రుసుముల్ని 100 శాతం మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ‘ఈవీ నూతన పాలసీ’ని తీసుకొచ్చింది. ఈ విధానం నేటి (సోమవారం) నుంచి అమల్లోకి వచ్చింది. 

Also Read: సునీతా విలియమ్స్‌ ఆరోగ్యంపై ఆందోళనలు.. స్పందించిన ఆస్ట్రోనాట్

ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొత్త ఎలక్ట్రిక్ వాహనం ఏ కంపెనీది కొనుగోలు చేసినా పర్వాలేదన్నారు. అయితే గత ప్రభుత్వం పరిమిత సంఖ్యలో వాహనాలకే ఈవీ పాలసీని రూపొందించిందని.. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానంలో వాహనాల సంఖ్యపై పరిమితుల్ని తీసివేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: రగులుతున్న మణిపూర్...కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమీక్ష

ఇందులో భాగంగా పొన్నం ప్రభాకర్ ఆదివారం సచివాలయంలో నూతన ఈవీ విధానం వివరాలను అధికారులతో కలిసి వివరించారు. రాష్ట్ర పరిధిలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎన్ని రిజిస్ట్రేషన్‌ అయితే అన్నింటికీ 2026 డిసెంబరు 31 ఈ నూతన పాలసీ విధానం వర్తిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఈ గడువును పొడిగించే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. 

ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, ఆర్టీసీ సహా ఫార్మా, ఐటీతోపాటు ఇతర కంపెనీలు తమ ఉద్యోగుల రవాణా కోసం ఎలక్ట్రిక్‌ బస్సులు కొంటే రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్‌ ఫీజులో 100 శాతం మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా రెండో వెహికల్ కొనుకున్న వాహనదారుకి 2 శాతం అదనపు పన్నును మినహాయిస్తామని తెలిపారు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వెహికల్ నూతన పాలసీకి సంబంధించి జీవో 41ను జారీ చేశారు. 

#telangana-government #electric-vehicles #Minister Ponnam Prabhakar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe