పార్టీకి పిలిచి దారుణానికి పాల్పడ్డ స్నేహితులు.. ఏం చేశారంటే?

బాలానగర్‌కు చెందిన 25ఏళ్ల రోహిత్ కుమార్ సింగ్ తన స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకకు అల్కపూరి కాలనీకి వచ్చాడు. ఓ భూవివాదంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రోహిత్ తలపై మద్యం బాటిళ్లతో మిగిలిన ఇద్దరు స్నేహితులు దాడి చేశారు. ఈ దాడిలో రోహిత్ మృతి చెందాడు.

New Update

ఈ మధ్య కాలంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. స్వార్థం లేని స్నేహం కూడా ఒక్కోసారి కలుషితమైపోతుంది. క్షణకావేశంలో తోటి స్నేహితుడిని సైతం హతమార్చేందుకు కొందరు వెనుకాడటం లేదు. ఎన్నో ఏళ్లుగా కష్టం, సంతోషంలో కలిసి మెలిసి ఉండే వారు కూడా ఒక్కసారిగా శత్రువులుగా మారి ప్రాణాలు తీసుకుంటున్నారు. 

Also Read :  డీజీపీపై వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!

తాజాగా అలాంటిదే జరిగింది. తన పుట్టిన రోజుకు పిలిచిన ఓ స్నేహితుడు దారుణానికి పాల్పడ్డాడు. ఫుల్‌గా మద్యం తాగి.. తోటి స్నేహితుడిపైనే దాడికి పాల్పడ్డాడు. మద్యం బాటిళ్లతో తలపై కొట్టడంతో తోటి స్నేహితుడు మృతి చెందాడు. ఈ ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..

Also Read : 11వ తరగతి ఖతర్నాక్ కుర్రోడు.. 200 మందిని నిలువునా ముంచేశాడు..!

ఫుల్‌గా మద్యం పార్టీ

బాలానగర్‌కు చెందిన 25 ఏళ్ల రోహిత్ కుమార్ సింగ్ తన స్నేహితుడు అక్బర్ పుట్టిన రోజు వేడుకకు IDPL నుంచి అల్కపూరి కాలనీకి వచ్చాడు. ఇక కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత రోహిత్ కుమార్, అలాగే గోల్కొండకు చెందిన అక్బర్, అఫ్రోజ్ కలిసి ఫుల్‌గా మద్యం పార్టీ చేసుకున్నారు. 

Also Read :  వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ!

అదే సమయంలో ఓ భూ వివాదంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రోహిత్ తలపై మిగిలిన ఇద్దరు మద్యం బాలిళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రోహిత్ అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావంతో పడిపోవడంతో ఇద్దరు నిందితులు అక్కడ నుంచి పారిపోయారు.

Also Read : లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోహిత్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చిక్కిత్స పొందుతూ రోహిత్ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు