గాడిద పాల దందాలో భారీ మోసం.. రూ.100 కోట్లు! గాడిదపాల ఉత్పత్తిలో భారీ మోసం వెలుగు చూసింది. చైన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు 400 మందికి రూ.100 కోట్లు ఎగవేసిందంటూ గాడిదపాల ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. By srinivas 15 Nov 2024 | నవీకరించబడింది పై 15 Nov 2024 17:14 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Donkey milk: గాడిదపాల ఉత్పత్తిలో భారీ మోసం వెలుగు చూసింది. లాభాల పేరుతో ఆశ చూపి రైతులను తమిళనాడుకు చెందిన ఓ ముఠా నట్టేటా ముంచింది. ఫ్రాంచైజీ మోడల్ పేరుతో గాడిద పాలు సేకరించిన డాంకీ ప్యాలెస్ మిస్టర్ బాబు ఉలగనాథన్ గ్యాంగ్ రూ.100 కోట్లు ఎగవేశారంటూ బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన గాడిద పాల రైతులు.. చైన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు తమను నిలువునా ముంచిదని, న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. లీటరు రూ.1600 చొప్పున కొంటామని.. కరోన మహమ్మారి టైమ్ లో గాడిద పాలకు డిమాండ్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చూసి డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ సంప్రదించాం. మిస్టర్ బాబు ఉలగనాథన్ ఆధ్వర్యంలో గిరి సుందర్, బాలాజీ, సోనికరెడ్డి, డాక్టర్ రమేశ్ బృందం సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.5లక్షలు తీసుకుంది. ఒక్కో గాడిదను రూ.80వేల నుంచి రూ.1.50 లక్షల విక్రయించారు. తర్వాత గాడిద పాలు లీటరు రూ.1600 చొప్పున తీసుకుంటామని ఒప్పందం కుదుర్చుకున్నారు. 3 నెలల పాటు డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. 18 నెలలుగా పాల డబ్బులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: Subbayya Gari Hotel: సుబ్బయ్యగారి హోటల్ సీజ్.. భోజనంలో జెర్రీ! అలాగే వాళ్లు రాసి ఇచ్చిన బ్యాంకు చెక్కులు బౌన్స్ అయినట్లు గాడిదపాల రైతులు చెబుతున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన 400 మంది రైతులు రూ.100 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలిపారు. దీనిపై చెన్నై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేదంటూ కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకుంటామంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. ఇది కూడా చదవండి: ద్రౌపది ముర్ముపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. #donkeys #milk మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి