Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో ఏడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కమిషన్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మరికంటి భవాని, మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్, అడ్వకేట్ సునీల్ కుమార్, రాంరెడ్డి గోపాల్ రెడ్డి, గూడురు గంగాధర్, కే.వి. నర్శింహా రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే బీసీ కమిషన్ ఛైర్మన్‌గా జి.నిరంజన్, వ్యవసాయ కమిషన్ ఛైర్మన్‌గా కోదండరెడ్డి, విద్యా కమిషన్ ఛైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: TGPSC Group-1 : ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 మెయిన్స్ ఫస్ట్ పేపర్!
మొదటి విడతలో 37 మందికి అవకాశం..
ఇక మొదటి విడతలో 37 మందికి వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన విషయం తెలిసిందే. కాగా సామాజిక సమతుల్యత పాటించి ఈ పదవులు భర్తీ చేస్తోంది. వీటికి డిమాండ్ ఉండడంతో పార్టీ నాయకత్వం ఆచితూచి అడుగులేస్తోంది. పార్టీ బలోపేతానికి పని చేసిన వారికే పదవులు దక్కాలన్న యోచనలో కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యేలకు కొన్ని కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు సమాచారం. కాగా ప్రధానంగా ఆర్టీసీ, పౌరసరఫరాలు, మూసీ సుందరీకరణ కార్పొరేషన్ తదితర ముఖ్యమైన పదవులు ఎమ్మెల్యేలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: గేర్ మార్చిన హైడ్రా.. ఇకనుంచి నాలాల అక్రమ నిర్మాణాలు టార్గెట్