TGPSC Group-1 : ప్రశాంతంగా ముగిసిన గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫస్ట్ పేపర్!

తెలంగాణలో బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్‌ మొదటి పేపర్ పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్ కు భారీ హాజరు శాతం నమోదైంది. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు ఆలస్యంగా వచ్చినవారిని లోపలికి అనుమతించలేదు.

author-image
By srinivas
New Update
TSPSC Group-1 Updates: గ్రూప్-1 రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్పీఎస్సీ.. విచారణ ఎప్పుడంటే?

Group-1 : తెలంగాణలో బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్‌ మొదటి పేపర్ పరీక్ష ముగిసింది. మొదటి రోజు ఇంగ్లీష్ పేపర్ కు భారీగా హాజరు శాతం నమోదైంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లను మూసివేసిన అధికారులు.. ఆలస్యంగా వచ్చినవారిని లోపలికి అనుమతించలేదు. ఇక పరీక్షలను వాయిదా వేయాలంటూ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్‌ 163 సెక్షన్‌ విధించారు. పరీక్ష  కేంద్రాల దగ్గరలో 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఎవరినీ ఉండనివ్వలేదు. 

ఇది కూడా చదవండి: కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ వద్ద రిపోర్టు.. వాళ్లపై సీరియస్

జవాబుపత్రాలు తరలించే వాహనాలకు జీపీఎస్‌..

ఇక అక్టోబర్ 27 వరకు వివిధ సబ్జెక్టుల ప్రకారం పరీక్షలు జరగనుంగా.. ప్రతి కేంద్రం వద్ద ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్‌ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లను ఉంచారు. పరీక్ష గది, చీఫ్‌ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగే పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలను తరలించేందుకు జీపీఎస్‌ అమర్చిన వాహనాలు నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించేలా రూట్‌మ్యాప్‌ ఏర్పాటు చేశారు. ఇక మొత్తం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి: Hydra: మరో బిగ్ టాస్క్‌ చేపట్టిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ వారే!

ఇదిలావుంటే.. గ్రూప్-1 పరీక్ష విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్ ఆరోపించారు. బీసీ బిడ్డగా అభ్యర్థులందరినీ తాను భరోసా ఇస్తున్నానన్నారు. సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా.. రిజర్వుడు కేటగిరీకి అన్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం నుంచి ఈ భరోసా ఇస్తున్నామన్నారు. జీఓ 29 తో నష్టం అనేది కేవలం అపోహ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ నియామకాల పేరుతోనే అధికారంలోకి వచ్చిందన్నారు. పదేళ్లలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read :  ఆ కళ్ళు చూస్తే ఎవరైనా చూపు తిప్పుకోలేరు.. వైట్ డ్రెస్ లో హాట్ బేబీ క్యూట్ లుక్స్

Also Read :  నా సినిమా బాలేకపోతే థియేటర్ కు రాకండి.. విశ్వక్ సేన్ ఓపెన్ ఛాలెంజ్

Advertisment
Advertisment
తాజా కథనాలు