TS:రెండు ప్రాజెక్టులకు పేరు మార్చిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న రెండు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్, సింగూరు ప్రాజెక్టుల పేర్లను మార్చింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది.

author-image
By Manogna alamuru
New Update
project

Palamuru Project, TS

తెలంగాణలో ఉన్న రెండు ప్రాజెక్టుల పేర్లలో మార్పులు చేసిన గవర్నమెంట్. దీనికి సంబంధించి ఈ రోజు నీటిపారుదల శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గుర్తుగా.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టింది. ఇక మీదట నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. ఎస్. జైపాల్ రెడ్డి పీఆర్ఎల్‌ఐ ప్రాజెక్టుగా పిలవబడుతుంది.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మించారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరందుతోంది.

Also Read : ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

సింగూరుకు కూడా..

దీంతో పాటూ సింగూరు ప్రాజెక్టు పేరును కూడా మర్చాలని డిసైడ్ అయింది నీటి పారుదలశాఖ. దీనికి మంత్రి దామోదర రాజనర్శింహ తండ్రి, దివంగత కాంగ్రెస్ నేత రాజనర్శింహ పేరును పెట్టారు. సింగూరు ప్రాజెక్టుకు సిలారపు రాజనర్సింహ ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ మంజీరా నది ఫై సింగూర్ గ్రామం దగ్గర నిర్మింపబడింది. అందుకే దీనికి సింగూర్ ప్రాజెక్ట్ అని పేరు వచ్చింది. ఇది సంగారెడ్డి నుండి 36 కి.మీ. దూరం లో ఉంది. ఈ ప్రాజెక్ట్ 1988 లో.. 29 టి.ఎం.సి.ల నీటిసామర్థ్యంతో నిర్మించారు. ఇది ప్రదానంగా త్రాగు నీటి కోసమే నిర్మింపబడింది. దీని ద్వారా హైదరాబాద్ పట్టణ ప్రజలకు త్రాగు నీరు అందుతుంది.ఈ ప్రాజెక్ట్ ద్వారా జల విద్యుత్ ఉత్పతి అవుతుంది.

Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా  థాయిలాండ్‌!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు