వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై కీలక అప్‌డేట్..

ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఎయిర్‌పోర్టు విస్తరణకు కావాల్సిన మరో 256 ఎకరాల భూ సేకరణ కోసం రూ.205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే ఎయిర్‌పోర్టు పరిధిలో 696 ఎకరాల వరకు భూమి ఉంది.

New Update
war 2

వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్టుకి సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. విమానశ్రయం నిర్మాణంలో మరో ముందడుగు పడింది. మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చొరవతో మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఎయిర్‌పోర్టు విస్తరణకు కావాల్సిన 256 ఎకరాల భూ సేకరణ కోసం రూ.205 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే ఈ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్‌ను సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీకి రోడ్లు, భవనాల మంత్రిత్వశాఖ లేఖ రాసింది.  

Also Read: మహారాష్ట్రలో పవన్ ప్రచారం..తెలుగు, హిందీ, మహారాష్ట్రల్లో ప్రసంగం

 మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్‌ సంస్థ విరమించుకుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్టు పరిధిలో మొత్తం 696 ఎకరాల వరకు భూమి ఉంది. ఈ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్‌వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్‌.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ), నేవిగేషన్ ఇన్‌స్ట్రూమెంట్ ఇన్‌స్టలేషన్‌ నిర్మాణాలు చేపట్టనున్నామని రోడ్ల భవనాల శాఖ వెల్లడించింది.   

Also Read: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి?

  ఇదిలాఉండగా.. నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌లో పర్యటించనుండగా ఇందులో భాగంగానే మామునూరు ఎయిర్‌పోర్టులో విమానాశ్రయ పనులను ఆయన ప్రారంభించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వరంగల్‌ అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే వరంగల్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని వేగంగా అడుగులు వేస్తోంది.  

Also Read: రహస్యంగా వారసుడుని ఎన్నుకున్న ఖమేనీ.. కారణమేంటి?

Also Read: అమ్మో దెయ్యం.. 50మంది మృతి, వణికిపోతున్న తెలంగాణ వాసులు!

Advertisment
తాజా కథనాలు