/rtv/media/media_files/2025/07/30/double-bed-room-2025-07-30-13-31-12.jpg)
Double bed room
పేద ప్రజల కోసం గతంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇచ్చింది. వీటిలో కొందరు నివసిస్తుండగా.. మరికొందరు అసలు ఈ ఇంట్లోకి వెళ్లలేదు. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఆ ఇళ్లను వెనక్కి తీసుకోవాలని భావిస్తోంది. ఎందుకంటే ఈ ఇళ్లలో ఎవరూ ఉండటం లేదు. ఖాళీగా ఉండకుండా కనీసం ఎవరైనా ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇళ్లు లేక రాష్ట్రంలో ఎందరో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికైనా ఈ ఇళ్లు ఉపయోగపడతాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇళ్లు ఉచితంగా ఇవ్వడం అనేది పెద్ద విషయమే. అందులోనూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంటే.. కట్టడానికి దాదాపుగా రూ.10 లక్షల పైనే అవుతుంది. ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి లబ్దిదారులకు ఇళ్లు ఇస్తే అందులో ఉండకుండా ఖాళీగా ఉంచుతున్నారు. ఇలా వాడకుండా ఉండిపోయిన ఇళ్లను వెనక్కి తీసుకుని, వేరే లబ్దిదారులకు ఇస్తే బెటర్ అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఇది కూడా చూడండి: TG New Ration Cards: కొత్త రేషన్‌కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ స్కీమ్స్ కూడా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
సిటీకి దూరంగా ఉండటం వల్ల..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకున్న వారిలో ఎక్కువగా బీఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని విమర్శలు కూడా వచ్చాయి. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిటీకి, గ్రామానికి దూరంగా ఉంటున్నాయి. సిటీలో ఉన్నవారు వారి జాబ్ చేసుకుంటూ శివార్లకు వెళ్లడం లేదు. ఆ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉండాలంటే కొన్ని కిలో మీటర్లు ప్రయాణించి వెళ్లాలి. దీనివల్ల సమయం ఎక్కువగా వృథా అవుతుందని చాలా మంది ఈ ఇళ్లలో ఉండటం లేదు. గ్రామాల్లో ఉండే వారి పరిస్థితి కూడా అంతే. సిటీకి దగ్గరలో ఇళ్లను ఇవ్వాలని పలువరు కోరుతున్నారు. దీనికి తోడు ఆ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కరెంట్, వాటర్ వంటి పనులు పూర్తి చేయలేదని కొందరు వాపోతున్నారు. కనీస సౌకర్యాలు లేని వాటిలో ఉండటం కంటే సిటీ లేదా గ్రామానికి దగ్గరగా ఉండి ఉద్యోగాలు చేసుకుంటే బెటర్ అని కొందరు భావించి ఈ ఇళ్లలో ఉండటం లేదు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: వారందరి పెన్షన్లు కట్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. కారణమిదే!
కలెక్టర్ ఆదేశాలతో నోటీసులు
ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన ఆ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఎవరైతే ఉండటం లేదో వారికి కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు నోటీసులు పంపనున్నట్లు సమాచారం. ఇప్పటికైనా వారు ఆ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి వెళ్లకపోతే వాటిని రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 37 శాతం మంది లబ్ధి దారులు ఆ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉండటం లేదని సమాచారం. ఇలా ఉండని వారందరి దగ్గర నుంచి ఆ ఇళ్లను వెనక్కి తీసుకుని అందులోకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఇళ్లను వెనక్కి తీసుకున్న వారికి కూడా అనుకూలమైన ప్రాంతంలో ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.