KTR on Double Bed Rooms: వచ్చే వారమే డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ..గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్!
డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారంలో మొదటి విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలంటూ ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.