BIG BREAKING: మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత మృతి!

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ కన్నుమూశారు. 2007లో కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి MLCగా ఎన్నికైన సత్యనారయణ తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేశారు. ఆయన మృతికి సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు సంతాపం తెలిపారు.

New Update
TELANGANA BREAKING

మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈ రోజు సంగారెడ్డిలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న సత్యనారాయణ 2007లో కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అయితే.. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 2008లో తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత TGPSC సభ్యుడిగా ఆయనకు అవకాశం వచ్చింది. అయితే.. 2024లో బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రేవంత్ రెడ్డి సంతాపం..

మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, శాసనమండలి సభ్యులుగా సత్యనారాయణ చేసిన సేవలు తెలంగాణ సమాజం మరిచిపోలేనివన్నారు. వారి కుటుంబ సభ్యులకు రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారి మృతి బాధాకరమని బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ట్వీట్ చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జర్నలిస్టుగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా , తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుడిగా సత్యనారాయణ తనదైన ముద్ర వేశారు. బీఆర్ఎస్ పార్టీకి వారి సేవలు చిరస్మరణీయమన్నారు. సత్తన్న ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు.

Advertisment
తాజా కథనాలు