తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టారు. మీరు ఫలితాలు తెలుసుకోవాలంటే tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్ ఫలితాలను వెబ్‌సైట్‌తో పాటు మొబైల్‌లో కూడా తెలుసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల
The Telangana State Board of Intermediate Education (TSBIE) will declare the TS Inter 1st and 2nd year results 2025 on April 22 at 12 pm on the official website. As per the information, this year Deputy Chief Minister Bhatti Vikramarka will announce the results soon. However, it…
— Mohd Fasiuddin (@MohdFasiuddin10) April 22, 2025
ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..
మొత్తం 9.97 లక్షల మంది..
ఇంటర్ ఫలితాలను భట్టి విక్రమార్క విడుదల చేస్తూ.. మాట్లాడారు. ఇంటర్ పరీక్షలను మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు రాశారన్నారు. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మొత్తం 71.37 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్!
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 66.89 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ను వారం రోజులు సమయం ఇవ్వనున్నారు. మే 22 నుంచి అడ్వాన్సడ్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఇందులో బాలికలదే పైచేయి. ఇంటర్ ఫస్టియర్‌లో 57.83 శాతం బాలురు ఉత్తీర్ణత కాగా.. 73 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు.