/rtv/media/media_files/2025/08/13/cm-revanth-chiranjeevi-2025-08-13-12-51-27.jpg)
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల గుండెపోటుతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ కుటుంబం నుంచి ఆయన భార్యే బరిలోకి దిగుతారని ప్రచారం నడుస్తోంది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికపై గట్టిగానే ఫోకస్ పెట్టింది.
Also Read : AP SI : ఖాకీ కాదు కాట్రాజ్.. కేసు పెట్టడానికి వస్తే కోరిక తీర్చాలంటూ.. ఏం చేశాడంటే?
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. అనంతరం ఎమ్మెల్యే మృతితో వచ్చిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక సీటును గెలుచుకున్న కాంగ్రెస్, జూబ్లీహిల్స్‌లో కూడా అదే విజయాన్ని పునరావృతం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అంటేనే ఎక్కువగా సినీ గ్లామర్ టచ్ ఉంటుంది కాబట్టి వారినే బరిలోకి దించాలని కాంగ్రెస్ ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారే. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ వ్యహాలకు పదను పెడుతుంది.
Also read : మొన్న బెదిరింపులు.. ఈరోజు కాళ్ల బేరం.. ఇండియాని నీళ్లు అడుక్కుంటున్న పాకిస్తాన్
సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని బయటకి చెప్పినప్పటికీ చిరంజీవితో ఇదే విషయంపై సీఎం రేవంత్ ప్రధానంగా చర్చించినట్లుగా పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇప్పటికీ ఆయనకు కాంగ్రెస్‌తో మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. చిరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలంగాణలో ఆయన పొలిటికల్ రీఎంట్రీ అవుతుంది.
ఒకవేళ చిరంజీవి పోటీ చేయడానికి వెనుకాడితే నాగార్జునను లేదా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను బరిలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇక అజారుద్దీన్ ఈ ఎన్నికలో పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. టికెట్ తనకే వస్తుందని ఆయన ఆశీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. లిస్టులో ప్రముఖంగా నవీన్ యాదవ్ పేరు కూడా వినిపిస్తోంది. ఈయనకు కూడా సినిమా ఫీల్డ్ తో మంచి సంబంధాలున్నాయి. గ్లామర్ టచ్ తో పాటుగా ఆంధ్రా సెటిలర్స్ కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగానే ఉంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిని పైనల్ చేయనుంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలయ్యాక పార్టీ అభ్యర్థిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.