AP SI : ఖాకీ కాదు కాట్రాజ్.. కేసు పెట్టడానికి వస్తే కోరిక తీర్చాలంటూ.. ఏం చేశాడంటే?

న్యాయం కోసమని  ఓ మహిళా పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కితే కీచకంగా ప్రవర్తించాడు ఓ ఎస్సై. నగ్న వీడియోలు పంపిస్తూ కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తూ నగ్నంగా చూపిస్తూ టార్చర్ పెట్టాడు.  

New Update
si rajasekhar

న్యాయం కోసమని  ఓ మహిళా పోలీస్ స్టేషన్ మెట్టు ఎక్కితే కీచకంగా ప్రవర్తించాడు ఓ ఎస్సై. నగ్న వీడియోలు పంపిస్తూ కోరిక తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తూ నగ్నంగా చూపిస్తూ టార్చర్ పెట్టాడు.  బాధితురాలు మీడియాను ఆశ్రయించడంతో ఎస్సై భాగోతం బయటపడింది.

అవసరాన్ని ఆసరాగా మార్చుకుని

వివారాల్లోకి వెళ్తే..   ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలంలోని పట్నం పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం గరుగుతాండాకు చెందిన ఓ వివాహిత మహిళా తాను విడాకులు తీసుకున్న విషయంమై ఆ సమయంలో తనకు సరిగా న్యాయం జరగలేదని పట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తన అవసరాన్ని ఆసరాగా మార్చుకున్న పట్నం ఎస్సై రాజశేఖర్ బాధితురాలి బంధువుల్లో ఒకరిని పరిచయం చేసుకుని ఆమె నెంబర్ సంపాదించాడు. ఇక అప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా మాట్లాడుతూ..  వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తూ  టార్చర్ చేయడం మొదలుపెట్టాడు.

తనకు అలాంటి చర్యలు ఇష్టం లేదని, తనకు ఫోన్ చేయవద్దని బాధితురాలు చెప్పిన వినిపించుకోలేదు ఎస్సై రాజశేఖర్. పదేపదే న్యూడ్ వీడియోస్ పంపడం నగ్నంగా వీడియో కాల్ చేయడం వంటివి మరింతగా పెంచాడు. బాధిత మహిళ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తుండటంతో ఎవరికి చెప్పుకోలేకపోయింది.  దీన్ని మరింత ఆసరాగా తీసుకున్న ఎస్ఐ తన కామా కోరికలను ఆమెపై మరింతగా చూపించి వేధించాడు. దీంతో విసిగిపోయిన  బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. 

Advertisment
తాజా కథనాలు