TG Congress: డీకే శివకుమార్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ.. సంచలన నిర్ణయం?

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో తెలంగాణ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన శివకుమార్ తో ఓ ప్రైవేట్ హోటల్ లో సమావేశమయ్యారు.

New Update
DKS Rajagopal Reddy

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(dk-shiva-kumar) తో తెలంగాణ MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy-raja-gopal-reddy) భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన శివకుమార్ తో ఓ ప్రైవేట్ హోటల్ లో సమావేశమయ్యారు. CM రేవంత్ పై ఇటీవల రాజగోపాల్ రెడ్డి వరుస విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్ని రోజులుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. సీఎం రేవంత్ రెడ్డిపై నిత్యం విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాను పదేళ్లు సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెబితే.. అది కాంగ్రెస్ పార్టీ విధానం కాదంటూ కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి. అనంతరం సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం రేవంత్ ఫైర్ అయితే.. అది పద్ధతి కాదంటూ ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా వారికి తాను అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు.

ఈ రోజు ఏకంగా సీఎం తన భాష మార్చుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి.. ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని సూచించారు. 20 మంది ఆంధ్రా కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లో  చేరే సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు హామీ ఇచ్చినట్లు కోమటిరెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ను రాజగోపాల్ రెడ్డి ఎందుకు కలిశాడన్న అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైనే ఆయన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 

Also Read :  42 శాతం బీసీ రిజర్వేషన్ మోదీ మెడలు వంచి తీసుకుందాం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Komatireddy Raja Gopal Reddy Meets DK Shiva Kumar

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డీకే శివకుమార్ తెలంగాణ పాలిటిక్స్(TG Congress) పై కూడా దృష్టి సారించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) పీసీసీ చీఫ్ అవ్వడంతో పాటు ఆయనను సీఎంగా ఎంపిక చేయడంలోనూ డీకే ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో శివకుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో పాటు అనేక మంది అభ్యర్థులకు ఆర్థికంగా సహాయం అందించారన్న టాక్ ఉంది. ఇంకా కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి ముఖ్యంగా రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో డీకే శివకుమార్ ఒకరు. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల తన వైఎస్సార్టీపీ పార్టీనపి కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు డీకే శివకుమార్ ను పలు మార్లు కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగానే ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో పాటు.. ఏపీ పీసీసీ చీఫ్ గా నియమతులయ్యారన్న టాక్ ఉంది. 

Also Read :  రేవంత్ రెడ్డి మోసం చేశారు.. రోడ్డుపై పెట్రోల్ తాగిన దంపతులు..

Advertisment
తాజా కథనాలు