Indiramma Houses: రేవంత్ రెడ్డి మోసం చేశారు.. రోడ్డుపై పెట్రోల్ తాగిన దంపతులు..

ఇందిరమ్మ ఇళ్లు రాలేదని కరీంనగర్ జిల్లాలో శ్రీనివాస్, సృజన దంపతులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. లబ్ధిదారుల లిస్ట్ లో పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని, తాగడానికి యత్నించడంతో వెంటనే పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

New Update
Indiramma Houses

Indiramma Houses

Indiramma Houses: కరీంనగర్ జిల్లా(Karimnagar District), చిగురుమామిడి మండలం, సుందరగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఎదురుచూస్తున్న ఒక పేద దంపతులకు నిరాశే మిగిలింది. అద్దె ఇంట్లో నివసించే వంతడుపుల శ్రీనివాస్, సృజన దంపతులు లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. దింతో మంగళవారం గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో పెట్రోల్‌తో నిరసనకు దిగారు.

అసలేం జరిగిందంటే..?

నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్, సృజన దంపతులు చాలా కాలంగా ప్రభుత్వ పథకాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. తమ పేరు తప్పకుండా జాబితాలో ఉంటుందని ఆశించారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో తమ పేరు లేకపోవడంతో షాక్‌కు గురయ్యారు. తాము అన్ని అర్హతలు ఉన్నా కూడా ఎంపిక కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో కు కట్టుబడని పార్టీల సభ్యత్వం రద్దు..కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఈ దంపతులు పెట్రోల్ బాటిల్‌తో నిరసన తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. స్థానికులు వారిని ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆవేశంలో శ్రీనివాస్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని, కొంత పెట్రోల్ తాగడానికి యత్నించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పెట్రోల్ తాగడంతో అతడిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో కసాయి భర్త.. ప్రియురాలి కోసం భార్య, పిల్లల్ని ఏం చేశాడంటే!

ఈ ఘటనతో సుందరగిరి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పేదల ఆశలను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వారికి వెంటనే ఇళ్లు మంజూరు చేయాలని, లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయని హెచ్చరించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పేద కుటుంబాల దుస్థితిని, ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న లోపాలను మరోసారి స్పష్టంగా తెలియజేసింది. ప్రభుత్వం ఈ సంఘటనపై స్పందించి, విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు