తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న వారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ X ఖాతాలో ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ బోనస్ ప్రకటనతో రాష్ట్రంలో సన్న వడ్ల సాగు భారీగా పెరిగిందని ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో సన్న బియ్యం పంపిణీ సులభతరం అవుతుందని వివరించారు. రాష్ట్రంలో సన్న బియ్యం పంట ఉత్పత్తి రావడంతో రేట్లలో కూడా తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు. ఇది కూడా చదవండి: MLC Kavitha: అది నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కవిత సవాల్ త్వరలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ pic.twitter.com/L8sJPUuvyO — Telangana Congress (@INCTelangana) January 3, 2025 రేపటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం.. రేపు.. అంటే ఈ నెల 4న తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ అంశంపై చర్చించనున్నారు. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఈ స్కీమ్ ను అమలు చేయాలన్నది సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. రాష్ట్రంలోని 92 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఇది కూడా చదవండి: Flash News : అలెర్ట్.. రైతు భరోసాపై కీలక అప్డేట్ ప్రస్తుతం రేషన్ కార్డుపై దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే.. 90 శాతానికి పైగా ప్రజలు వాటిని తినడానికి ఇష్టపడడం లేదు. దీంతో వాటిని కోళ్ల ఫారాలకు విక్రయించడం లాంటిది చేస్తున్నారు. కొందరు వ్యాపారులైతే రేషన్ షాపుల బయటే కార్డుదారుల నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర అవసరాలకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదన్న చర్చ చాలా రోజులుగా ఉంది. రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ చేస్తే ఈ పరిస్థితి ఉండదన్న వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సన్నబియ్యం పంపిణీకి సర్కార్ మొగ్గు చూపుతోంది.