BR Ambedkar: అంబేద్కర్‌ ఆలోచనలే మాకు ప్రేరణ.. ఘన నివాళ్లు అర్పించిన సీఎం రేవంత్!

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆలోచనలనే తమకు ప్రేరణ అని చెప్పారు. ఆయన స్ఫూర్తితో  తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

New Update
ambedkar cm rvnt

CM Revanth Reddy tributes on Ambedkar Jayanti

BR Ambedkar: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలనే తమకు ప్రేరణ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఈ మేరకు నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం ఘన నివాళులు అర్పించారు.

ప్రపంచానికి ఆదర్శం..

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. అట్టడుగు వర్గాలకు అవకాశాల కోసం అంబేద్కర్‌ పేరిట నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నాణ్యమైన విద్య, రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్‌ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరారు. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

అంబేద్కర్ వల్లే తెలంగాణ..

బలహీన వర్గాలు, మహిళల సాధికారత కోసం అంబేద్కర్ అవిశ్రాంతంగా కృషిచేశారని గుర్తు చేశారు. దీర్ఘదృష్టితో దేశ భవిష్యత్తును ఊహించి, దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భావి తరాలకు స్ఫూర్తిగా నిలిచారని పొగిడారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాధ్యం చేసింది అంబేద్కర్‌ రాజ్యాంగమేనని అన్నారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేస్తోందన్నారు. దళితుల అభ్యున్నతిలో తెలంగాణ రాష్టం దేశానికి మార్గదర్శకంగా నిలపడగమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. 

Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

cm-revanth | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు