తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూసీ వెంట పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ నెల 8న పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సీఎం దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. వారి ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. మూసీలో కాలుష్యం నిర్మూలనకు ప్రభుత్వం చేయనున్న కార్యక్రమాలను వారికి వివరించనున్నారు. వారి నుంచి కూడా సీఎం సలహాలు అడిగి తెలుసుకుంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వలిగొండ మండలంలో రేవంత్ పాదయాత్ర ఉండనుందని తెలుస్తోంది. ఈ పాదయాత్రలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు భారీగా పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. నెలాఖరు నుంచే రైతు భరోసా..
Also Read : బంగ్లాదేశ్‌కు అదానీ పవర్ షాక్.. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిక
అత్యంత ప్రతిష్టాత్మకంగా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే.. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో నిర్వాసితుల ఆందోళనలు, వారికి ప్రతిపక్షాల మద్దతుతో ప్రభుత్వం నిర్మాణాల తొలగింపుపై కాస్త వెనక్కు తగ్గింది. ఇప్పటికే నదీ గర్భంలో నిర్మాణాలు చేసుకున్న వారిలో మెజారిటీ మందికి డబుల్ బెడ్రూంలు ఇచ్చి అక్కడికి తరలించింది. అయితే.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేసుకున్న వారు మాత్రం డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. దీంతో వారిని ఒప్పించేందుకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వడంపై సర్కార్ ఫోకస్ పెట్టింది.
ఇది కూడా చదవండి: BREAKING: కులగణనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Also Read : ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో బస్సు పడి..
ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ సదస్సులు..
మరో వైపు మూసీ కలుష్యం కారణంగా ఇబ్బంది పడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో సదస్సులు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అక్కడి రైతులతో భారీగా సమావేశాలు నిర్వహించి మూసీ కాలుష్యంతో జరుగుతున్న నష్టం.. రేవంత్ సర్కార్ చేపట్టబోయే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ పై అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ సర్కార్ యాదాద్రి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆయన పాదయాత్ర ఆ ఒక్కరోజే కొనసాగుతుందా? లేక రెండు, మూడు రోజులు జరుగుతుందా? అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.