Konda Surekha-Revanth: రేవంత్‌కు కొత్త తలనొప్పులు.. కొండా సురేఖ ఔట్? వరుస వివాదాలతో ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్న కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సమంత ఇష్యూతో పాటు వరంగల్ లో రేవూరి ప్రకాశ్ రెడ్డితో విభేదాలతో రేవంత్ రెడ్డి ఆమెపై తీవ్ర By Nikhil 14 Oct 2024 in తెలంగాణ వరంగల్ New Update షేర్ చేయండి 'మా వాళ్లను ఇబ్బంది పెడితే సహించం..' వరంగల్ పోలీసుల టార్గెట్‌గా మంత్రి కొండాసురేఖ చేసిన కామెంట్స్ ఇవి. గీసుకొండ మండలంలోని ధర్మారంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత రచ్చ రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్‌లో సీఐ కుర్చీలో కూర్చొని కొండాసురేఖ హల్‌చల్ చేయడం సీఎంకు ఇరకాటంలో పెట్టింది. ఇప్పటికే కొండాసురేఖ విషయంలో రేవంత్ సర్కార్ కార్నర్ అయ్యింది. సమంత-నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అంటూ కొన్ని రోజుల క్రితం సురేఖ మాట్లాడిన మాటల మంటలు ఇంకా చల్లారకముందే ఆమె మరో వివాదంలో చిక్కుకోవడం మొత్తం కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: Jagga Reddy: జగ్గారెడ్డి షాకింగ్ ప్రకటన.. ఇక గుడ్ బై! వరంగల్ లో కొండా వర్సెస్ ప్రకాశ్ రెడ్డి.. దసరా ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డి ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేసి ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఫొటో లేకపోవడంతో వివాదం మొదలైంది. రేవూరి, కొండా వర్గీయుల మధ్య ఘర్షణలకు దారి తీసింది. ఈ క్రమంలో ధర్మారం రైల్వేగేట్ దగ్గర మంత్రి కొండా సురేఖ వర్గీయుల ధర్నా చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గీసుకొండలో పరిస్థితులు అదుపు తప్పాయి. ఇది కూడా చదవండి: కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. కేటీఆర్ కు కోర్టు కీలక ఆదేశాలు! ♦️వరంగల్ జిల్లా ధర్మారంలో ఉద్రిక్త వాతావరణం...♦️మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గీయుల మధ్య వివాదం pic.twitter.com/SXQehdEUf5 — DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) October 14, 2024 పోలీస్ స్టేషన్లో హల్ చల్.. కొండా సురేఖ అనుచరులు ఎమ్మెల్యే వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దీనిపై రేవూరి ప్రకాష్ రెడ్డి గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే తన అనుచరులను అరెస్ట్ చేయడంతో కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ కు వచ్చి హంగామా చేశారు. ఏకంగా సీఐ కుర్చీలో కూర్చుని అరెస్ట్ చేసినవారిని విడిచిపెట్టాలంటూ హల్‌చల్ చేశారు. తన వర్గం కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేశారంటూ దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవ్వడంతో అది చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి: పండుగ పూట ఇదేం దోపిడీ సారూ..? వైరల్ అవుతోన్న RTC బస్ టికెట్ల ఫొటోలు! = మంత్రి కొండ సురేఖ రాకతో గీసుగొండ పోలీస్ స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత..= సీఐ కుర్చీలో కూర్చున్న మంత్రి కొండా సురేఖ@cpwarangal @BJP4Telangana @DCP_WESTZONEWRL pic.twitter.com/31Vai2lpb8 — Praveen tej puppala (@puppala_tej) October 14, 2024 కూర్చొని మాట్లాడుదామన్న రేవంత్.. పోలీస్‌స్టేషన్‌కు మంత్రి సురేఖ వచ్చి పోలీసులపై చర్యలు తీసుకునేదాకా అక్కడే కూర్చుంటానని చెప్పడంతో వరంగల్ సీపీ ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నేరుగా రేవంత్‌రెడ్డి, పార్టీ పెద్దల నుంచి సురేఖకు ఫోన్ రావడంతోనే ఆమె పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు రావాలని, ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి వస్తున్నారని, కూర్చొని మాట్లాడుదామని సురేఖకు రేవంత్ చెప్పినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: హైదరాబాద్-విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి అదిరిపోయే శుభవార్త! రాహుల్ గాంధీ నుంచి ఆదేశాలు? అక్కినేని కుటుంబంపై అనుచిత కామెంట్స్ చేసిన తర్వాత కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలని నేరుగా రాహుల్‌గాంధీ చెప్పారన్న టాక్ కూడా నడిచింది. అయితే రియాలిటీలో మాత్రం ఇవేవి జరగలేదు. అసలు ఆ విషయంపై రేవంత్ రెడ్డి బయటకు స్పందించలేదు. అక్కినేని ఫ్యామిలీపై తన కామెంట్స్‌కు సారీ చెప్పిన కొండాసురేఖ ఆ తర్వాత కూడా ఎక్కడ వెనక్కి తగ్గలేదు. మంత్రిపదవి నుంచి ఆమెను కాంగ్రెస్ భర్తరఫ్ కూడా చేయలేదు. అసలేం జరగనట్టే హస్తం పార్టీ తీరు నడిచింది. సరిగ్గా ఇలాంటి సమయంలో వరంగల్ జిల్లా ఇంటర్నెవ్ వార్‌తో మరోసారి కొండాసురేఖ వార్తల్లో నిలవడం సంచలనంగా మారింది. ఇది కూడా చదవండి: Telangana: దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎన్ని కోట్లు తాగారంటే? నాగార్జున కుటుంబం, కేటీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలతో పరువు నష్టం కేసులను కొండాసురేఖ ఎదుర్కొంటున్నారు. అయినా కూడా ఆమె ఎక్కడా తల వంచడం లేదు. దూకుడు కనబరుస్తూనే ఉన్నారు. నిజానికి గత ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే పరకాలతో కొండా కుటుంబానికి రాజకీయ అనుబంధం ఎక్కువ. అది వారి సొంత నియోజకవర్గం కూడా.. ఆమె అక్కడి నుంచి గతంలో ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది మంత్రిగా కూడా పని చేశారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆమె వరంగల్ తూర్పుకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. కొండా సురేఖ గారు.. మీరు మా కుటుబం మీరు చేసిన ఆరోపణలు పూర్తగా అబద్ధం.. దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోండి : నాగార్జున pic.twitter.com/fUQjVsqi9s — Friday Poster (@fridaysposter) October 2, 2024 పరకాలలో కొండా ఫ్యామిలీకి మంచి ఫాలోయింగ్.. గత ఎన్నికల సమయంలో మళ్లీ పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా.. ఈ సారి పార్టీ ఆదేశాలతో మళ్లీ తూర్పు నుంచే ఆమె ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది. అయినా.. పరకాలలో వారి ఫాలోయింగ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో అక్కడ వారి జోక్యం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ ఎమ్మెల్యేతో వారికి వివాదాలు కూడా ఎక్కువే. ఈ సారి ఆ వివాదం ఫ్లెక్సీల రూపంలో వచ్చింది. మరోసారి ఏ రూపంలో వస్తుందో తెలియదు.. మొత్తం కొండా సురేఖ అంటేనే కాంట్రవర్శిలకు కేరాఫ్ అనేలా ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి. ఇది అటు తిరిగి ఇటు తిరిగి రేవంత్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే సురేఖ ఇష్యూపై కాంగ్రెస్ హైకమాండ్ సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని రేవంత్ కు ఆదేశాలు కూడా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మంత్రివర్గ విస్తరణ సమయంలో సురేఖను తప్పించి.. ఆమె స్థానంలో మరో బీసీని కేబినెట్లోకి తీసుకోవడానికి రేవంత్ సిద్ధమైనట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. #ktr #revanth-reddy #konda-surekha #warangal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి