BIG Breaking : విచారణకు రండి.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు

ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జనవరి 06వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.

New Update
ktr acb 1

ktr acb 1 Photograph: (ktr acb 1)

ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 2025 జనవరి 06వ తేదీన అంటే సోమవారం ఉదయం 10 గంటలకు తమ ముందు విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో కేటీఆర్ తోపాటుగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌ రెడ్డిలకి కూడా నోటీసులిచ్చింది. 

ఈడీ సైతం నోటీసులు 

ఇప్పటికే ఈ కేసులో 2025 జనవరి 07వ తేదీన విచారణకు రావాలని ఈడీ సైతం కేటీఆర్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ఏసీబీ కూడా నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.  ఈ కేసుకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేపట్టింది. ఫెమా నిబంధనలను ఉల్లఘించినట్టుగా గుర్తించిన ఈడీ కేసును దర్యాప్తు చేపట్టింది.  

తీర్పు రిజర్వ్

ఫార్ములా ఈ కార్‌ రేస్‌ పై ఏసీబీ తనపై కేసు నమోదు చేయడంతో కేటీఆర్ హైకోర్టును సంప్రదించారు.  ఇది తప్పుడు కేసు అని దీనిని కొట్టివేయాలంటూ హైకోర్టులో  క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం..  2024 డిసెంబర్ 31 వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.  అనంతరం డిసెంబర్ 31న మరోసారి విచారణ చేపట్టిన కోర్టు  కేటీఆర్‌ను ఎలాంటి అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను ఆదేశిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. 

Also Read :  అలెర్ట్.. రైతు భరోసాపై కీలక అప్డేట్

Advertisment
తాజా కథనాలు