ఐఏఎస్ స్మితా సబర్వాల్ తీరుపై కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి హోదాలో ఉండి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ట్వీట్స్ చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీంతో శాఖా పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి స్మిత తీరు వివాదాస్పదంగా ఉందన్న చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Woman Kill Husband: భర్తని లేపేయడానికి భార్య ప్లాన్.. లవర్‌తో పాము కొనిపించి రాత్రికిరాత్రే
#Ghibli Story On #Hyderabad Today! #SaveHCU #SaveHCUBioDiversity#SaveHyderabadBioDiversity 🏞️ pic.twitter.com/ozbmxvSZ7D
— Hi Hyderabad (@HiHyderabad) March 31, 2025
పోలీసుల నోటీసులు..
HCU వ్యవహారంలో ఇప్పటికే ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. BNSS సెక్షన్ - 179 కింద నోటీసులు జారీ చేశారు. నోటీసులోని విషయాలను వెల్లడించేందుకు మాత్రం పోలీసులు నిరాకరించారు. HCU కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూమి ఇష్యూలో AI-జనరేటెడ్ గిబ్లి ఇమేజ్‌ను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Telangana: గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్.. రాష్ట్రానికి రూ.27 వేల కోట్ల పెట్టుబడులు
మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన ఇమేజ్‌ను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని సైతం ఆమె రీపోస్ట్ చేశారు. అత్యంత బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్మిత పోస్టులు పెట్టడం సరికాదన్న అభిప్రాయాన్ని సచివాలయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఆమెపై చర్యలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి పోస్టింగ్ ఇవ్వకుండా ఆమెను పక్కటన పెట్టే ఛాన్స్ ఉంది.
(smitha-sabrwal | telugu-news | telugu breaking news)