Ande Sri : గొర్ల కాపరి నుంచి కవి వరకు.. అనాథ నుంచి డాక్టర్ రేట్ వరకు... అందెశ్రీ ప్రయాణం ఇదే!

ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీని వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆస్పత్రిలో చేర్చారు ఆయన కుమారులు. అక్కడ చికిత్సపొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు.

New Update
andesri

ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీని వెంటనే ఆయన కుమారులు గాంధీ ఆస్పత్రిలో చేర్చారు ఆయన కుమారులు. అక్కడ చికిత్సపొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

అందెశ్రీ  1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు, ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య.అందెశ్రీ బాల్యం ఎంతో కష్టంగా సాగింది. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఆయన తన తల్లిదండ్రులు ఎవరో, తన సొంత ఊరు ఎక్కడో తెలియదు. జీవనం కోసం కొన్నాళ్లు గొర్రెల కాపరిగా పనిచేశారు. అక్కడి నుంచే ఆయన కవిత్వం రాయడం ప్రారంభించారు. ఏ విధమైన చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. 

తెలుగు సాహిత్యంపై పట్టు

తన స్వీయ కృషి, పట్టుదలతో తెలుగు సాహిత్యంపై పట్టు సాధించారు. కవిత్వంలో అందెశ్రీ కృషికి గాను పలు విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేశాయి. అందెశ్రీ గుర్తింపు తెచ్చిన మొట్టమొదటి పాట తెలంగాణ పల్లెల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన తాగుబోతు పాట ('మాయమైపోతున్నడమ్మ... మనిషన్నవాడు'). ఆయన మొదటిసారి స్టేజిపై పాడింది కూడా ఈ పాటనే.

అందెశ్రీ తన కవిత్వం, పాటలు ఆలపించేటప్పుడు ఒక ప్రత్యేకమైన మ్యానరిజం ఉంటుంది ప్రదర్శిస్తారు. కళ్ళు మూసుకుని, తల ఊపుతూ, గంభీరంగా పాడే ఆయన శైలి తెలుగు ప్రజలకు సుపరిచితం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన రాసిన పాటలు, ముఖ్యంగా జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం అనే గేయం ఊపిరిగా నిలిచింది. ఈ పాట లేకుండా ఉద్యమ సభ ఉండేది కాదు. ఈ పాటనే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ఎంపిక చేశారు.

సినీ గేయ రచయితగా ఆయనకు 2007లో విడుదలైన గంగ  చిత్రంలోని పాటలకు ఉత్తమ గీత రచయితగా ప్రతిష్ఠాత్మకమైన నంది అవార్డు లభించింది. సినీ రంగంలో ఆయన రాసిన పాటల్లో ఎంతో లోతైన భావాలు ఉంటాయి. ఒక విచిత్రం సినిమాలో ఈతరం తీర్పు అనే పాట, 'ముత్యాల ముగ్గు' సినిమాలో చిలకా ఏడున్నది అనే పాటలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.

జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఈ ప్రజాకవికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన సేవలకు గాను ప్రభుత్వం రూ. కోటి నగదు పురస్కారం అందించింది. ఆయన జీవితం కష్టాల నుంచి గొప్ప గౌరవం వైపు సాగిన ప్రయాణానికి ఉదాహరణ.

Advertisment
తాజా కథనాలు