/rtv/media/media_files/2025/11/10/andesri-2025-11-10-08-34-59.jpg)
ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీని వెంటనే ఆయన కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్చారు ఆయన కుమారులు. అక్కడ చికిత్సపొందుతూ అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. అయితే అందెశ్రీ మృతి పట్ల గాంధీ ఆసుపత్రి హెచ్ఓడి జెనరల్ మెడిసిన్ సంచలన విషయాలు వెల్లడించారు. హార్ట్ స్ట్రోక్ తోనే అందెశ్రీ చనిపోయారని తెలిపారు. అందెశ్రీకి గత 5 ఏళ్లుగా హైపర్ టెన్షన్ ఉందన్నారు. అయితే ఆయన నెల రోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదన్నారు. ఆయనకు ఆయాసం కూడా ఉందన్నారు. చెస్ట్ డిస్ కంఫర్టబుల్ ఉన్నారని తెలిపారు.
ఆరోగ్య విషయంలో అందెశ్రీ నెగ్లెట్ చేశారని తెలిపారు హెచ్ఓడి జెనరల్ మెడిసిన్ . రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారని.. ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్ రూమ్ వద్ద కింద పడిపోయి కనిపించారని తెలిపారు. రాత్రి ఏం జరిగిందో తెలియదని వెల్లడించారు. ఉదయం 6:20 ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆయనను 7:20 కి గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు ఆయనను తీసుకొచ్చారని వెల్లడించారు. డాక్టర్ సింధూర గాంధీ హాస్పిటల్ లో అందెశ్రీ చనిపోయారని ఆర్ఎంవో డిక్లేర్ చేశారని వెల్లడించారు. దాదాపుగా అందెశ్రీ చనిపోయి ఐదు గంటలు అవుతుందన్నారు. మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్న అందెశ్రీ ఏ వైద్యున్ని కూడా సంప్రదించలేదన్నారు. నెల రోజుల నుండి ఆయన కనీసం బీపీ టాబ్లెట్లు కూడా వేసుకోలేదని చెప్పుకొచ్చారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
మరోవైపు ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్, రంగారెడ్డి / మెద్చల్ మల్కజిరి కలెక్టర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు సమన్వయం చేసుకుంటూ.. అందెశ్రీ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. అంతిమ సంస్కారాలకు తేదీ, సమయం, స్థలం వివరాల్ని పూర్తిగా తెలుసుకుని, పోలీసు గౌరవాలతో అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది
Follow Us