/rtv/media/media_files/2025/09/03/kavitha-2025-09-03-17-42-55.jpg)
ఇంట్లో కుంపటి అంతా ఇంతా కాదన్నట్లు ఉంది ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి. సొంత మనుషులే బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు. కుటుంబ తగాదాలు, అధికారం కోసం విభేదాలు వస్తున్నాయి. హరీశ్ రావు, సంతోశ్ రావులపై అవినీతి ఆరోపణలు చేసిన కవితను మంగళవారం BRS పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడే కాదు.. గత కొన్ని రోజుల నుంచి కవిత పరిస్థితి అలాగే ఉంది.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న KCR అన్న కూతురు రమ్యా రావు సైతం గతంలో పార్టీకి దూరమయ్యారు. స్వయాన కేసీఆరే ఆమెకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అయితే కుటుంబ కలహాలతో రమ్య తెలంగాణ ఆవిర్భావానికి ముందే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆమె KCR, సంతోశ్ రావులపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేయడం అప్పట్లో సంచలనమైంది. ఇప్పడు అదే రీతిలో కవిత బీఆర్ఎస్‌కు దూరమైంది. అప్పుడు అన్న కూతురు రమ్యా రావు, ఇప్పుడ కన్న కూతురు కవిత ఇద్దరూ కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.