అల్లు అర్జున్ కు బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మద్దతు పలికారు. అల్లు అర్జున్ పై ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ కుట్ర చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఇందులో రాజకీయ కుట్ర కోణం కనిపిస్తుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ ను రాజకీయంగా ఎందుకు పొలిటికల్ టర్న్ చేశారో అర్థం అవ్వడం లేదన్నారు. ఈ విషయాన్ని ఇంత పెద్ద రచ్చ చేయడం సరికాదన్నారు. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ నేతలేనని ఆరోపించారు. కాంగ్రెస్ సపోర్ట్ తోనే దాడి జరిగిందని ధ్వజమెత్తారు. రేవంత్ కుటుంబ సభ్యుల వేధింపులతోనే కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు డీకే అరుణ.ఇది కూడా చదవండి: "చిరు, పవన్, ప్రభాస్ ఎక్కడ పడుకున్నారు.. ఎంత దుర్మార్గులు రా మీరు" పోలీసులు అప్పుడెందుకు కేసు పెట్టలేదు.. రేవంత్ కు అక్కడ మానవత్వం గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థ అప్పుడేం చేసిందో చెప్పాలన్నారు. సీఎం కుటుంబం వేధింపులతో చనిపోతే కేసులు చేయరా? అన్నారు. సినిమా ఇండస్ట్రీని వేధిస్తున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం కొనసాగుతోందన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ లో రేవంత్ కు చెడ్డ పేరు వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో అల్లు అర్జున్ విషయం ప్రస్తావనకు తెచ్చాడన్నారు. ఇది కూడా చదవండి: CV Anand Apology: అల్లు అర్జున్ ఇష్యూలో బిగ్ ట్విస్ట్.. సారీ చెప్పిన హైదరాబాద్ సీపీ! పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన రోజే ప్రెస్ మీట్ పెడితే బాగుండేదన్నారు. పోలీసుల తీరు చూస్తే ప్రభుత్వం తలచుకుంటే ఏదైనా చేయొచ్చని అర్థం అవుతుందన్నారు. హైదరాబాద్ లాంటి నగరాన్ని వదిలి సినిమా ఇండస్ట్రీ వెళ్తదని తాను అనుకోవడం లేదన్నారు. కేటీఆర్ కేసుపై కేసు విషయంలోనూ డీకే అరుణ స్పందించారు. కేటీఆర్ తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. ఈడీ ఎంట్రీతో బీజేపీకి సంబంధం లేదన్నారు.