/rtv/media/media_files/2024/11/18/BR99X3LsH0c1ovhiBWr7.jpg)
బీజేపీ ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూనిర్వాసితులను పరామర్శించేందుకు లగచర్ల వెళ్తుండగా మొయినాబాద్ పీఎస్ వద్ద వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అరెస్ట్ చేసిన బీజేపీ నేతలను నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు.
Also Read: పోలీసులను చితకొట్టిన అఘోరి.. ఈడ్చుకెళ్లి DCMలో పడేసి ఏం చేశారంటే?
ఎంపీ శ్రీమతి @Aruna_DK గారితో కలిసి సంగారెడ్డి జైలులో ఉన్న లగిచర్ల రైతులను పరామర్శించడం జరిగింది.
— Eatala Rajender (@Eatala_Rajender) November 18, 2024
వారిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ:
లగ్గిచర్ల రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ తరఫున మేం చేస్తున్న డిమాండ్స్ :
👉 రైతులపై పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలి.
👉… pic.twitter.com/ey1DgP0I8d
రైతుల సమ్మతి లేకుండా భూములు గుంజుకోవద్దు..
ఈ రోజు ఉదయం సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల రైతులను సైతం బీజేపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. రైతులపై పెట్టిన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని, జైళ్లలో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా.. మానవత్వం లేకుండా రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల సమ్మతి లేకుండా భూములు గుంజుకోవద్దన్నారు.
Breaking News: కొడంగల్, లగచర్ల రైతులను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ని మొయినాబాద్ వద్ద అడ్డుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు@maheshreddy_bjp @Eatala_Rajender @Aruna_DK #Arrested #Lagacherla #RTV pic.twitter.com/CUt2QcbPGb
— RTV (@RTVnewsnetwork) November 18, 2024
Also Read: అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్
లగచర్ల ఘటనలో రైతులను జైలులో పెట్టి.. భూములు ఇవ్వకుంటే బయటకు వదిలేది లేదంటూ వారి కుటుంబ సభ్యులను బెదిరించడం దుర్మార్గం. ఆ రోజు ఘటనలో భాగమైన కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి, బీజేపీ, ఇతర పార్టీల కార్యకర్తలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి తన వైఫల్యాన్ని… pic.twitter.com/qVmY6ZI4cX
— D K Aruna (@Aruna_DK) November 18, 2024
Also Read: Hyderabad Food: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...!
డీకే అరుణ మాట్లాడుతూ.. లగచర్ల ఘటనలో రైతులను జైలులో పెట్టి.. భూములు ఇవ్వకుంటే బయటకు వదిలేది లేదంటూ వారి కుటుంబ సభ్యులను బెదిరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆ రోజు ఘటనలో భాగమైన కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి, బీజేపీ, ఇతర పార్టీల కార్యకర్తలను టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన వైఫల్యాన్ని ఒప్పుకోలేక ప్రజల్ని భయపెట్టి, బెదిరించి ఫార్మా కంపెనీల కోసం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
Also Read: పరువు పోతుందనే లగచర్లలో రేవంత్ కుట్ర..ఈటల సంచలన ఆరోపణలు!