Reliance: వెనెజువెలా నుంచి రిలయన్స్‌ చమురు దిగుమతులు.. అమెరికా గ్రీన్‌సిగ్నల్

ఇంటర్నేషనల్‌ ఇంధన మార్కెట్‌లో భారత ఇంధన దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ కీలక విజయం సాధించింది. వెనెజువెలా నుంచి నేరుగా ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీకి 'జనరల్ లైసెన్స్'ను మంజూరు చేసింది.

New Update
Reliance wins US licence for Venezuelan oil

Reliance wins US licence for Venezuelan oil

ఇంటర్నేషనల్‌ ఇంధన మార్కెట్‌లో భారత ఇంధన దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ విజయం సాధించింది. వెనెజువెలా నుంచి నేరుగా ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీకి 'జనరల్ లైసెన్స్'ను మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో గతేడాది కాలంగా ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. డిస్కౌంట్ ధరకే భారీగా చమురు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ లైసెన్స్‌తో రిలయన్స్ కంపెనీ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వెనెజువెలా నుంచి చమురును కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఎగుమతి చేయవచ్చు, తన రిఫైనరీలలో శుద్ధి చేసుకోవచ్చు.

Also Read: బంగ్లాదేశ్‌ ప్రధానిగా తారిక్ రెహమాన్.. భారత్‌కు లాభమా? నష్టమా ?

రష్యా చమురుపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో వెనెజువెలా నుంచి లభించే భారీ ముడి చమురును రిలయన్స్‌ తక్కువ ధరకే కొనుగోలు చేయనుంది. అయితే ఈ మార్పు రావడానికి ఓ కారణం ఉంది. 2025లో అమెరికా విధించిన ఆంక్షల వల్ల రిలయన్స్ వెనెజువెలా నుంచి దిగుమతులు ఆపేసింది. ఈ ఏడాది జనవరిలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత అక్కడ రాజకీయ మార్పులు జరిగాయి. దీంతో అమెరికా ట్రెజరీ విభాగం వెనెజువెలా ఇంధన రంగంపై ఆంక్షలను సడలించింది. తాము ఎంపిక చేసిన కంపెనీలకు లైసెన్సులు జారీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే రిలయన్స్‌కు కూడా లైసెన్స్‌ వచ్చింది. 

Also Read: 85 శాతం కంటి చూపు కోల్పోయిన ఇమ్రాన్: పాక్ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

ఇదిలాఉండగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ సంస్థకు వెనెజువెలా నుంచి వచ్చే భారీ ముడి చమురును శుద్ధి చేయగల సామర్థ్యం ఉంది. ఈ ఒప్పందం వల్ల రిలయన్స్ లాభాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రిలయన్స్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన IOC (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్), HPCL కు కూడా ఇప్పటికే వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్లను ప్రారంభించాయి. ఈ రెండు ప్రభుత్వ రంగం సంస్థలు కలిసి సుమారు 2 మిలియన్ బారెళ్ల ముడి చమురును వెనెజువెలా నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.

Advertisment
తాజా కథనాలు