/rtv/media/media_files/2025/04/29/Y9nnpDD5DHU6Z5BYOyTI.jpg)
10th results
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు పదోతరగతి పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, వారి పేరెంట్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. రేపు అనగా బుధవారం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్‌గా తెలిపారు. ఈ మేరకు అధికారిక లింక్ కూడా వెల్లడించారు. http://results.bsetelangana.org/ ఈ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం
10th Results
కాగా ఈ 10వ తరగతి ఫలితాలను రేపు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు మార్కులు కూడ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు.
రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ టెన్త్ పరీక్షలు మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు రాశారు.#Telangana #SSC #10thresults #RTV pic.twitter.com/553SrCWQTj
— RTV (@RTVnewsnetwork) April 29, 2025
Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!
ఇదిలా ఉంటే గత ఏడాది వరకు 10th క్లాస్‌లో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్, క్యుములేటివ్ గ్రేడింగ్ పాయింట్ యావరేజ్ ఇచ్చారు. ఇక ఇప్పటి నుంచి మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు మార్కులు కూడా ఇవ్వనున్నారు. అంతేకాకుండా మార్కుల మెమోలపై సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ ఎగ్జామ్ మార్క్స్, టోటల్ మార్క్స్, గ్రేడ్స్ పొందుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ పరీక్షలకు దాదాపు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
telangana-10-exams | telangana-10th-class-results | telangana-10th-exams
Also Read: భారత్ సర్జికల్ స్ట్రైక్స్.. స్పాట్‌లో 200 మంది టెర్రరిస్టులు!