TS: ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

నిన్న అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడానికి ప్రయత్నించిన ఐఏఎస్ అధికారిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానాలని సీఎస్ సూచించింది. 

New Update
ts

Telangana Government

నిన్న అచ్చంపేట సభలో ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కిన ఐఏఎస్ అధికారి శరత్ పై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు తెలంగాణ సీఎస్ కీలక సూచనలు జారీ చేసింది. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానాలి. ఏఐఎస్ అధికారులు ఉన్నత ప్రవర్తన పాటించాలని చెప్పింది. ఐఏఎస్ అధికారులే ఇలా ప్రవర్తిస్తే ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. 1968 ఎఐఎస్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పింది. అధికారి ఎల్లప్పుడు పరిపూర్ణ నిజాయితీతో ఉండాలని..ఇకపై ఇలాంటి  చర్యలు  ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది. అనుచిత ప్రవర్తనపై క్రమశిక్షణ చర్యలు తప్పవని..ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే అధికారుల తీరు మారాలని సీఎస్ చాలా గట్టిగా చెప్పింది. 

ts
Telangana Government

 

today-latest-news-in-telugu | telanagna | ias-officers

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు