/rtv/media/media_files/2025/10/18/child-sex-abuse-2025-10-18-09-53-39.jpg)
Child Sex Abuse
Crime News: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు గతి తప్పుతున్నారు. పసివారు అని చూడకుండా ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాగా, విద్యార్థినీపై లైంగికదాడి చేసిన ఉపాధ్యాయుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..ట్యూషన్‌కు వచ్చిన ఓ విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఘటనలో పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ రాజేంద్రనగర్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది.
న్యాయమూర్తి పి.ఆంజనేయులు ఈ మేరకు తీర్పు వెలువరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవులపల్లి ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏడో తరగతి చదువుతున్న 12 ఏండ్ల బాలిక ఆమె నివసించే అపార్ట్‌మెంట్లోనే సుబ్రమణేశ్వర్‌రావు అనే వ్యక్తి వద్దకు ట్యూషన్‌కు వెళ్లేది.సుబ్రమణేశ్వర్‌రావు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు ట్యూషన్‌కు చెప్పేవాడు. 2017 డిసెంబరు 3న బాలిక తల్లిదండ్రులు చెన్నై వెళ్లారు. ఇంట్లో నానమ్మ ఒక్కతే ఉంది. బాలిక ఆరోజూ ట్యూషన్‌కు వెళ్లింది. రాత్రి 9 గంటలకు ట్యూషన్ నుంచి అందరినీ ఇంటివి పంపించిన సుబ్రమణేశ్వర్‌రావు.. బాలికను ఉండమన్నాడు. ఆ తరువాత గదిలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు.
మరుసటిరోజు బాలిక తల్లిదండ్రులకు ఫోన్‌చేసి విషయం చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు వచ్చి రాజేంద్రనగర్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేశారు. అనంతరం పూర్తి ఆధారాలను కోర్టులో సమర్పించారు. విచారణ జరిపిన జడ్జి.. అత్యాచారం నిజమేనని నిర్ధారించారు. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. అలాగే బాధితురాలైన బాలికకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు.