తెలంగాణలో స్కూల్లో దారుణం.. ప్యాంట్ జిప్ వేసుకోలేదని స్టూడెంట్‌ను!

తెలంగాణలోని నిజామాబాద్‌ సుభాష్‌ నగర్‌లో దారుణం జరిగింది. కాకతీయ ఒలంపియాడ్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్యాంట్ జిప్ వేసుకోలేదని ఉపాధ్యాయుడు ఘోరంగా అవమానించాడు. దీంతో ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

New Update
KTR (3)..

టీచర్ - విద్యార్థి మధ్య అనుబంధం చక్కని ఫ్రెండ్‌షిప్‌లా ఉండాలి. అప్పుడే వారి మధ్య కమ్యూనికేషన్ మరింత బలంగా ఉంటుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం సక్రమంగా లేకపోతే తాజాగా జరిగిన సంఘటన మాదిరే ఉంటుంది. అవును నిజమే.. ఒక స్టూడెంట్‌ని టీచర్ ఎప్పుడూ స్నేహభావంతో చూడాలి. ఎంతో తెలివితో స్టూడెంట్‌ని తీర్చిదిద్దాలి. అంతేకాని చిన్న చిన్న విషయాలకు విర్రవీగిపోకూడదు. 

తాజాగా అలా విర్రవీగిపోయిన ఓ ఉపాధ్యాయుడు స్టూడెంట్‌కి దారుణమైన శిక్ష విధించాడు. అందరిలోనూ నవ్వులపాలు చేశాడు. అది భరించలేని ఆ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇది ఎక్కడో జరగలేదు. తెలంగాణలోనే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. ఈ జిల్లాలలో భారీ వానలు!

అమానుషమైన ఘటన

నిజామాబాద్‌లోని సుభాష్ నగర్ కాకతీయ ఒలంపియాడ్ బ్రాంచ్‌లో తన్మయి అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. అయితే క్లాస్ మధ్యలో వాష్ రూమ్‌కి వెళ్లాడు. ఇక క్లాస్ పూర్తైపోతుందేమోనన్న హడావుడిలో ప్యాంట్ జిప్ వేసుకోవడం మర్చిపోయాడు. దీంతో క్లాస్ రూమ్‌లో ఉన్న ఉపాధ్యాయుడు అదేదో పెద్ద నేరంగా భావించి అవహేళనగా మాట్లాడాడు. 

స్టేజ్ ఎక్కించి అందరి ముందు అవమానించాడు. అందరూ నవ్వుకునేలా ఆ విద్యార్థిని కాసేపు స్టేజ్ పైనే ఉంచాడు. దీంతో ఆ విద్యార్థి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం ఇంటికి వచ్చి బోరున ఏడ్చాడు. కానీ తమ తల్లిదండ్రులకు మాత్రం జరిగిన విషయాన్ని చెప్పలేదు. ఇలా ఓ వైపు కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక మరోవైపు తన ఫ్రెండ్స్‌కు ముఖం చూపించుకోలేక తనలో తాను కుమిలిపోయాడు. 

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..10 మందికి తీవ్రగాయాలు

ktr,,

Also Read: Ap: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్.. భారీగా మద్యం ధరలు తగ్గింపు

అంతటి ఆగకుండా చాలా సార్లు బంగ్లా పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం కూడా చేసుకోవాలనుకున్నాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్‌కి వెళ్లి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఇప్పటి వరకు ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ టీచర్‌పై పోలీస్‌ స్టేషన్లో, డీఈఓ, చైల్డ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు