Tarnaka Junction: ఎనిమిదేళ్ల కష్టాలకు చెక్.. రీ-ఓపెన్ కు అంతా సిద్ధం! హైదరాబాద్ లోని తార్నాక జంక్షన్ ను తిరిగి ఓపెన్ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట క్లోజ్ చేసిన ఈ జంక్షన్ మరో పదిహేను రోజుల్లో రీ-ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా అధికారులు తార్నాక జంక్షన్ కు ఇరువైపులా ఉన్న రోడ్లను పరిశీలించారు. By Seetha Ram 06 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్ నగరంలో రోజు రోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతుంది. దీని కారణంగా ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రద్దీగా ఉండే జక్షన్లలో కొన్ని చోట్ల యూటర్న్ మూసివేశారు. దీని కారణంగా వాహనాల ఫ్లో సులువుగా ఉంటుందని భావించారు. కానీ అలా జరగలేదు. అంతకంటే ఎక్కువ రెట్టింపు అయింది. ఇదంతా మరెక్కడో కాదు హైదరాబాద్ లోని తార్నాక జంక్షన్ వద్ద జరిగింది. Also Read: నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు! గత 8 ఏళ్ల తార్నాక జంక్షన్ క్లోజ్ గత 8 ఏళ్ల కిందట బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ట్రాఫిక్ మేనేజ్ మెంట్ పేరుతో తార్నాక జంక్షన్ ను క్లోజ్ చేసారు. ముఖ్యంగా ఆ జంక్షన్ సమీపంలో మెట్రో పిల్లర్ అడ్డుగా ఉందని.. దాని వల్ల ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుందని గుర్తించారు. దీంతో ఆ ట్రాఫిక్ జామ్ ను నివారించాలని.. వాహనాల ఫ్లో ఈజీగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ పోలీసులతో అవసరం లేకుండా చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రైల్వే డిగ్రీ కాలేజీ సమీపంలో, ఇటు ఐఐసీటీ సమీపంలో యూటర్న్ లను ఏర్పాటు చేశారు. Also Read: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది! ట్రాఫిక్ సమస్యను నివారించాలనుకున్నారు.. కానీ అలా జరగలేదు. ట్రాఫిక్ మరింత అధికమైంది. తరచూ అత్యధిక సంఖ్యలో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. పదుల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అంతేకాకుండా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. Also read: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్...కూలిన భారీ భవనాలు! జంక్షన్ రీ-ఓపెన్ వీటన్నింటిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇటీవల ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ పై పనిచేసే అర్కడేస్ కంపెనీ, జీహెచ్ ఎంసీ ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్, ట్రాఫిక్ పోలీసులతో స్పెషల్ కమిటీ వేసింది. ఇందులో భాంగంగానే స్టడీ చేసి జంక్షన్ ను తిరిగి ఓపెన్ చేయాలని సిఫిర్సు చేసింది. దీంతో తార్నాక జంక్షన్ ను తిరిగి ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. యూటర్న్ ఇబ్బందులకు త్వరలో చెక్ పెట్టనున్నారు. Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..! ఈ మేరకు తాజాగా ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రశాద్, జీహెచ్ ఎంసీ జోనల్ కమిసనర్ రవికిరణ్ సహా ఙతర అధికారులు తార్నాక జంక్షన్ రోడ్లను, ఫుట్ పాత్ లను పరిశీలించారు. ఇందులో భాగంగానే జంక్షన్ కు సెంటర్ లో ఐలాండ్ ఏర్పాటు చేయనున్నారు. ఇరువైపులా ఆరు మీటర్లున్న ఫుట్ పాత్ లను మూడు మీటర్లకు కుదించనున్నారు. అలాగే స్టాప్ లను వేరేదగ్గరకు షిఫ్ట్ చేయనున్నారు. అయితే ఇదంతా జరిగేసరికి దాదాపు 15 రోజులు పడుతుందని సమాచారం. #tarnaka #latest telangana news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి