/rtv/media/media_files/2025/08/09/tollywood-workers-strike-2025-08-09-21-33-16.jpg)
Tollywood workers Strike
Tollywood workers Strike : తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా సమ్మె చేస్తున్న టాలీవుడ్ వర్కర్స్ రేపటి నుంచి తమ సమ్మెను మరింత ఉదృతం చేయనున్నారు. ఈ రోజు నిర్మాతలతో సినీ కార్మికుల ఫెడరేషన్ నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీనితో సమ్మెను మరింత తీవ్రం చేయనున్నట్టు కార్మిక ఫెడరేషన్ ప్రకటించింది. మకు 30 శాతం వేతనాలు పెంచాలి అని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులతో ఈ రోజు నిర్మాతల మండలి చర్చలు జరిపింది. అయితే నిర్మాతల ప్రతిపాదనలను కార్మిక ఫెడరేషన్ అంగీకరించలేదు.పర్సంటేజ్ విధానానికి కార్మికుల ఫెడరేషన్ ఒప్పుకోకపోవడంతో సమ్మె కొనసాగించనున్నట్లు డరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
Also Read : జనహిత పాదయాత్ర నాది..మీనాక్షిది కాదు.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
కార్మికులు అడిగినంత మొత్తంలో వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధంగా లేక పోవడంతో గత వారం రోజులుగా సినిమా షూటింగ్స్ అన్ని కూడా నిలిచిపోయాయి. అయితే తాజాగా ఈ సమస్యకు పరిష్కారించే దిశగా ఫిలిం ఛాంబర్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించింది. అయితే ఈ సమావేశం ముగిసినప్పటికీ కార్మికుల సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదని తెలుస్తోంది. ఈ సమావేశంలో సమస్య పరిష్కారం కాకపోవడంతో సినీ కార్మిక సంఘాల ఫెడరేషన్ నాయకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ నిర్మాతలు చెప్పినా అంశాలు మాకు నచ్చలేదని స్పష్టం చేశారు. తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. నిర్మాతలు మేము చెప్పిన డిమాండ్లకు ఒప్పుకోవడం లేదు.. అలాగే నిర్మాతల నిర్ణయాలు కూడా మాకు నచ్చలేదని స్పష్టం చేశారు. వర్కర్లకు 30శాతం వేతనాలు పెంచే వరకు షూటింగుకు వెళ్లే ప్రసక్తే లేదని అనిల్ కుమార్ తేల్చి చెప్పారు.
ఇది కూడా చూడండి:బోడి గుండుపై జుట్టు పెంచుతామంటూ.. కాకినాడలో కలకలం రేపుతున్న మరో కొత్త మోసం!
నిర్మాతల షరతులను అంగీకరిస్తాం కానీ..కార్మికులకు సమానంగా వేతనం పెంచాలని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తేల్చి చెప్పారు. రోజువారి కార్మికుల వేతనాలు అందరికీ ఒకేలాగా పెంచాలని, 13 యూనియన్ కార్మికులకు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నామని, నిర్మాతలు మాత్రం 10 యూనియన్ల కార్మికులకు మాత్రమే పెంచుతామని చెపుతున్నారన్నారు. ఇందులో ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్లకు పెంచలేమని నిర్మాతలు వెల్లడించారన్నారు. అందుకే నిర్మాతల డిమాండ్లను మేము ఒప్పుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. యూనియన్లను విడగొట్టేలా నిర్మాతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేపటి నుంచి నిరసనలు ఉధృతం చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం కొన్ని సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయని, ఎవరికైతే 30శాతం చెల్లిస్తున్నారో వారు మాత్రమే షూటింగ్ పనులలో పాల్గొంటున్నారని తెలిపారు.
Also Read: ఇండియన్లే భారతీయతను మర్చిపోతున్నారా..ఢిల్లీ రెస్టారెంట్ లో ఓ జంటకు అవమానం